ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ముందు ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే ఘటనలను సహించకూడదని ప్రధాని స్పష్టం చేశారు.
దేశీయ సమస్యల కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పర్యటనను వాయిదా వేసుకోవడంతో వచ్చే వారం సిడ్నీలో జరగాల్సిన క్వాడ్ సమ్మిట్‌ను ఆస్ట్రేలియా బుధవారం రద్దు చేసింది.