బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామని, సముద్రంలో పడేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ హిందువులు అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా వెళతారని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మోడీ మేనిఫెస్టోలో దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే ప్రకటన ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికలు కాశి, మథుర, హిందూ రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడతాయని అభిప్రాయపడ్డారు.
Aurangzeb tomb: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్(ఔరంగాబాద్) జిల్లాలోని ఖుల్దాబాద్‌లో ఉన్న మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. ఔరంగజేబు సమాధిని జాతీయ స్మారక చిహ్నాల జాబితా నుండి తొలగించాలని భారత పురావస్తు సర్వే (ASI)ని ఆదేశించాలని కార్యకర్త కేతన్ తిరోద్కర్ తన పిటిషన్‌లో కోర్టుని కోరారు. ఔరంగజేబు సమాధి ఏఎస్ఐ చట్టం 1958లోని సెక్షన్ 3కి అనుగుణంగా లేదని వాదిస్తోంది. ఈ సెక్షన్ కొన్ని పురాతన స్మారక చిహ్నాలను,…
RSS: మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాద మహారాష్ట్రలో ఉద్రిక్తతలకు కారణమైంది. సోమవారం రోజు నాగ్‌పూర్‌లో నమాజ్ పూర్తైన తర్వాత అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయి. మరో వర్గం ఇళ్లు, ఆస్తులు, వాహనాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేశారు. ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఫాహిమ్ ఖాన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇ
Nagpur Violence: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి వివాదం మహారాష్ట్రలో అగ్గిరాజేస్తోంది. నాగ్‌పూర్‌లో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒక్కసారి ముస్లిం మూక దాడులకు పాల్పడింది. దీంతో నగరంలో హింస చెలరేగింది. ప్రైవేట్ ఆస్తులు, వాహనాలు, పోలీసుల్ని టార్గెట్ చేస్తూ అల్లర్లు జరిగాయి. ఇదిలా ఉంటే, ఈ అల్లర్లపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులు ‘‘కుట్ర’’ ప్రకారం జరిగాయని, మణిపూర్ జాతి…
మహారాష్ట్ర ఎస్పీ అధ్యక్షుడు అబూ అజ్మీ.. మొఘల్ చక్రవరి ఔరంగజేబ్ గొప్ప పాలకుడని, క్రూరుడు కాదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వివాదం ముదరడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మి క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇందువల్ల ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో వివాదం మరింతగా ముదిరింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మసీదులో కోర్ట్ నియమించిన కమిషనర్లు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఈ సర్వేను ఆపేయాలంటూ జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది. సర్వేలో భాగంగా మసీదు ‘ వాజుఖానా’ లోని బావిలో శివలింగం బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్, శివలింగం బయటపడిన…