RSS: ఔరంగజేబు సమాధి వివాదం నడుస్తు్న్న వేళ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ.. ‘‘ భారతదేశ నైతికతకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని ఆరాధిస్తున్నామా..? ఆక్రమణదారుల మనస్తత్వం ఉన్నవారు భారతదేశానికి ముప్పు’’ అని అన్నారు.
Chhava: ఔరంగజేబు సమాధిని తొలగించాలనే వివాదం, నాగ్‌పూర్ ఘర్షణల నేపథ్యంలో ‘‘ఛావా’’ సినిమాని బ్యాన్ చేయాలని మతాధికారి డిమాండ్ చేశారు. బరేల్వీ మత గురువు మౌలానా షాబుద్దీన్ రజ్వీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాత్రని రెచ్చగొట్టే విధంగా చిత్రీకరించాలని లేఖలో ఆరోపించారు. ఇది వల్ల మతపరమైన అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఉందని ఆరోపిస్తూ ‘‘ఛావా’’ని నిషేధించాలని కోరారు. ఆల్ ఇండియా ముస్లిం జమ్మత్ దర్గా ఆలా హజ్రత్…
Yogi Adiyanath: దేశవ్యాప్తంగా ఔరంగజేబు సమాధి అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం నాగ్‌పూర్‌లో అల్లర్లకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణదారులను కీర్తించే వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది కొత్త భారతదేశమని, ఆక్రమణదారుల్ని కీర్తించడం దేశద్రోహ చర్య అని అన్నారు. ఔరంగజేబు పేరుని నేరుగా ప్రస్తావించకుండా.. మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసి, మన విశ్వాసంపై దాడి చేసిన వ్యక్తులను…
Sambhaji Maharaj: ఇటీవల మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్యే అబూ అజ్మీ మొఘల్ పాలకుడు ఔరంగజేబుని ప్రశంసించడం వివాదంగా మారింది. శివసేన, బీజేపీ అతడిపై విరుచుకుపడ్డాయి. మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయబడ్డాడు. ఇదిలా ఉంటే, మరాఠా పాలకుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా మంగళవారం అబూ అజ్మీ నివాళులు అర్పించారు. ఆయన పరాక్రమ యోధుడని ప్రశంసించారు.