Madhavaram Krishna Rao: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి వహించారు. వసంత్ నగర్, కూకట్‌పల్లిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మాధవరం కృష్ణారావు మాట్లాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హౌసింగ్ బోర్డు స్థలాలు అక్రమంగా వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘హౌసింగ్ బోర్డు ప్రజల సొత్తు, అది ఎవరికి కూడా జాగిరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా..…