ఓ ప్రభుత్వ ఉద్యోగి తన అటెండెన్స్ కోసం ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఉపయోగించుకున్నాడు. రోజూ ఒకే ఫోటో పెట్టడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టారు అధికారులు. దీంతో ఆ ఉద్యోగి చేసిన ఘనకార్యం వెలుగుచూసింది. సీఎం ఫోటోతో హాజరు నమోదు చేసిన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని చందయాపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్నను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జగిత్యాల జిల్లా కలెక్టర్. Also Read:Home Minister Vangalapudi Anitha:…
UP Teacher: ఉత్తర్ ప్రదేశ్‌లో ఉపాధ్యాయుల కోసం తీసుకువచ్చని డిజిటల్ హాజరు వ్యవస్థను ఆసరాగా చేసుకుని ఓ ఉపాధ్యాయుడు, తన తోటి మహిళా టీచర్‌ని ‘‘ముద్దు’’ కోరడం వివాదాస్పదమైంది.
గ్రూప్-4 పరీక్షకు వేలిముద్రతో హాజరు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) నిర్ణయించింది. గతంలో జరిగిన పరీక్షల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది
Andhra Pradesh: ఏపీలో ప్రస్తుతం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగుల హాజరు నమోదుకు ఫేస్ రికగ్నేషన్ యాప్ వాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమరావతిలోని సెక్రటేరియట్‌లో విధులు నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఫేస్ రికగ్నేషన్ యాప్ అటెండెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెక్రటేరియట్‌లోని ఉన్నతాధికారులు ఫోన్‌లలో ఫేస్ రికగ్నేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల ఆరో తేదీ నుంచి ఫేస్ రికగ్నేషన్…
సర్కారీ బడుల రూపరేఖల్ని మార్చేస్తున్న జగన్ సర్కార్… విద్యార్థులకు మెరుగైన విద్య అందేందుకు చర్యలు చేపడుతోంది. టీచర్లు రోజూ స్కూల్‌కు రావడమే కాదు… సమయపాలన పాటించేలా చేస్తోంది. దీనికోసం నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను ఉపయోగించబోతోంది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తోంది ఏపీ సర్కార్. ఇప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కూడా నడుం కట్టింది. టీచర్లకు ప్రత్యేకంగా తయారు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్ వైఎస్…