ఏపీలో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మ ఒడి కార్యక్రమం వివాదాస్పదంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈపథకంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. విజయనగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స వివరణ ఇచ్చారు. ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత తగ్గలేదు.. పదో తరగతిలో ఉత్తీర్ణత తగ్గింది…మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం అన్నారు. అమ్మ ఒడి అన్నది 75 శాతం అటెండెన్స్ ఉన్న విద్యార్థులకు ఇస్తున్నాం అన్నారు. ఇది ప్రతిఒక్కరూ గ్రహించి స్కూళ్లకి పంపించాలన్నారు.
విద్యార్థి బడి మానకూడదన్నదే అమ్మ ఒడి ఉద్దేశం అన్నారు మంత్రి. రెండు వేలు కోత అన్నది నిజమే. అందులో ఒకటి మెయింటెనెన్స్ కోసం వెయ్యి రూపాయలు, మరో వెయ్యి రూపాయలు వాచ్ మెన్, అలాగే పలు అవసరాలకు వినియోగిస్తాం అన్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఇంటింటికి కుళాయిలు అన్న కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఇంకో అయిదు ఇలాంటి భారీ ట్యాంకులు జిల్లాలో ఏర్పాటుచేశాం అన్నారు.
ఏడువేల ఆరు వందల కేఎల్ నీటిని స్టోర్ చేసి ప్రజలకు అందించాలని నిర్ణయించాం. గత ప్రభుత్వంలో డబ్బులు కట్టించుకుని నీళ్లు ఇవ్వలేకపోయిందని మంత్రి బొత్స విమర్శించారు. బీపీఎల్ కాని వాళ్లైతే అరువేలు కడితే నీటి కుళాయి అందిస్తాం. మా ఎమ్మెల్యేలతో పాటు మా ప్రతినిధులు వార్డులలో పర్యటిస్తున్నారు. నిరంతరాయంగా అందరికీ అందుబాటులో వుంటున్నామన్నారు మంత్రి బొత్స. ప్రతిపక్షాల విమర్శలపై ఆయన మండిపడ్డారు.
Illegal Relationship: ప్రేమలో యువకులు.. ఓ యువకుడి బలవన్మరణం