పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తుంది. మేదినీపూర్‌లో బీజేపీ నాయకుడు, నటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షో నిర్వహిస్తుండగా.. సీసాలు, రాళ్లు విసిరారు. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా.. బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌కు మద్దతుగా రోడ్‌షో చేసేందుకు మిథున్ అక్కడికి చేరుకున్నారు. మిథున్ రోడ్ షో మేదినీపూర్‌లోని కెరానిటాలా ప్రాంతానికి చేరుకోగానే తృణమూల్ కార్యకర్తలు రోడ్డు పక్కన బైఠాయించి నిరసన తెలిపారు. ఈ…
తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని అఖరి మెట్లు వద్ద రెండు చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో బిగ్గరగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.
అరవింద్ కేజ్రీవాల్ గురువు, సామాజిక కార్యకర్త అన్నా హజారే ఈరోజు ఆయన శిష్యుడిని టార్గెట్ చేశారు. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా కలిసి పోరాడిన అన్నా హజారే మద్యం కుంభకోణంపై కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. ఈరోజు ఓటు వేసిన అనంతరం అన్నా హజారే ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. దేశ రాజకీయాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా.. ప్రతి ఒక్కరూ సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. తమ వెనుక ఈడీ ఉన్న వారిని ఎప్పుడూ ఎన్నుకోవద్దని అన్నారు. Raghunandan Rao:…
ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేకరీ నిర్వాహకుడిపై ముగ్గురు అన్నదమ్ములు కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడు శశి గార్డెన్‌లో నివాసముంటున్నాడు. అయితే.. తన ఇంటి పక్కన ఉండే అక్రమ్ అనే వ్యక్తి తనపై కార్పొరేషన్‌తో పాటు ఇతర విభాగాల్లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. అంతేకాకుండా.. బేకరీ కారణంగా తన ఇల్లు వేడి అవుతుందని.. బేకరీని మూసివేయాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్.. ముసునూరు మండలానికి వెళ్తున్న క్రమంలో టీడీపీ నాయకుల అదే మార్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అటుగా వస్తున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ కారును అడిగించి పలువురు కార్యకర్తలు.. దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. రంగాపురం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, సొంగ రోషన్, చింతమనేని ప్రభాకర్ ఏర్పాటు…
హైదరాబాద్‌లో గేమింగ్ స్థావరంపై మాదాపూర్ ఎస్ఓటీ బృందం దాడులు చేసింది. గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గేమింగ్ స్థావరంపై మాదాపూర్ పోలీసులు మెరుపుదాడి చేశారు.
భూమ్మీద నూకలు ఉన్నట్లు ఉంది.. అందుకే బతికి బయటపడ్డాడు. చిరుత దాడి చేసినా తీవ్ర గాయాలైనప్పటికీ సేఫ్ గానే ఉన్నాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్ గయ్ విటల్.. ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో చిరుత దాడి చేసింది. ఈ ఘటన హరారే సమీపంలోని బఫెలో రేంజ్ లో జరిగింది. ఈ విషయాన్ని తన భార్య హన్నా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తీవ్ర గాయాలైన విటలో ఫోటోను ఆమె పోస్ట్ చేసింది.
ఉపాధి కోసం సౌదీ అరేబియాలో పని చేస్తున్న ఓ వ్యక్తి.. తన భార్య అక్రమ సంబంధానికి సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి. దీంతో హుటాహుటిన అక్కడి నుంచి ఇండియాకు వచ్చాడు. ఈ తతంగాన్ని ప్రశ్నించేందుకు స్వదేశానికి వచ్చిన భర్తపై భార్య ప్రియుడితో కలిసి దాడి చేయించింది. ఈ ఘటన యూపీలోని బులంద్‌షహర్‌లోని కొత్వాలి దేహత్ ప్రాంతంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని.. ఈ క్రమంలో తన మొబైల్…