కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర పనులు చేస్తోందని మండిపడ్డారు.
వీధికుక్కలు సైరవిహారం చేస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. హైదరాబాద్ నగరంలోని ప్రజలపై కుక్కుల దాడి మరీ ఎక్కువైంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన శామీర్ పేట అద్రాస్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ వైద్యుడిపై కత్తితో దాడి చేశాడు. కాగా.. డాక్టర్ కైలాష్ రాఠీగా గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు నాసిక్ పంచవటిలోని సుయోగ్ హాస్పిటల్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బర్త్ డే వేడుకల్లో మునిగితేలుతున్న.. బర్త్ డే బాయ్ పై రెస్టారెంట్ సిబ్బంది కత్తితో దాడి చేశారు. పితంపుర శివార్లలోని ఓ మాల్‌లో ఈ సంఘటన జరిగిది. 23 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుండగా.. రెస్టారెంట్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి అతడిని కత్తితో పొడిచాడు.
సింహం.. అడవికి రారాజు. అది గాండ్రించిందంటే ఏ జంతువైనా.. ఏ మనిషైనా హడలెత్తిపోవల్సిందే. ఎంత పెద్ద జంతువైనా లయన్ ముందు బలాదూరే. అయితే అన్ని సార్లు తమ ప్రతాపం చూపించడం కుదరదని ఈ సీన్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ అగ్రనేత చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొ్న్నారు. కాగా.. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు మరోసారి దాడి చేశారంటూ ఆరోపిస్తున్నారు. కాగా.. శనివారం కూడా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి పాల్పడింది. ఆ దాడిని కాంగ్రెస్ ఖండించింది. అధికార పార్టీ బీజేపీ.. దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హక్కును 'అణచివేస్తోందని' ఆరోపించింది. రాజ్యాంగాన్ని…
Hyderabad Crime: అంబర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలుడు (16) ఘాటుకి దిగాడు. ప్రేమించాలంటూ ఓ అమ్మాయిపై కత్తితో దాడి చేసిన బాలుడు శవమై కనిపించాడు.
రిపబ్లిక్ డేను దృష్టిలో ఉంచుకుని.. జనవరి 26న జమ్మూకశ్మీర్‌లో దాడికి ప్లాన్ చేశామని ఉగ్రవాది జావేద్ మట్టూ తెలిపాడు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం విచారణలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యుడిగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. హిజ్బుల్ ముజాహిదీన్ A++ కేటగిరీకి చెందిన ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ ఈ నెల జనవరి 4న అరెస్టయ్యాడు. కాగా.. అతన్ని పోలీసులు విచారించగా, ఈ విషయం బయటపడింది.
తమిళనాడులోని కాంచీపురంలో ఆలయ పూజారులు ఒకరి ఒకరు కొట్టుకున్నారు. అదేంటి.. పూజారులు కొట్టుకోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండీ. వారు కొట్టుకున్నది ఒక పాట పాడే విషయంలో. నిజానికి.. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రకు పూజారులు భారీగా తరలి వస్తారు. కాగా యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. పూజారులు వడకలై, టెంకలైలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అంతేకాకుండా.. చంపేస్తామంటూ…