Dogs Attack: జవహర్ నగర్ పరిధిలోని వికలాంగుల కాలనీలో వీధి కుక్కల వీరంగం సృష్టించాయి.ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు విహాన్ పై విచక్షణారహితంగా దాడి చేయడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో సోమవారం ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు కొండపై నుండి ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు. అంతేకాకుండా.. గ్రెనేడ్లు కూడా విసిరారని అధికారులు తెలిపారు. కాగా.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. గత నెల జూన్ 11, 12 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రదాడులతో దద్దరిల్లింది.
అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఇంట్లోకి చొరబడి కత్తితో అతి దారుణంగా గొంతు కోసి యువకుడు పరారయ్యాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండు పాలెం లోచోటుచేస్తుంది. 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శిని(14) బాలికపై సురేష్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో.. ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కాగా.. సంఘటన స్థలంలోనే నిందితుడు కత్తి…
మల్కాజ్గిరి మరోసారి రాజకీయ కక్షలతో రణరంగంగా మారింది. మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలి ఆర్టీసీ కాలనీలో రోడ్డు పనులను సందర్శించడానికి వెళ్లిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పై మౌలాలి కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. గత కొంతకాలంగా మౌలాలి డివిజన్ లోని ఆర్టీసీ కాలనీ రోడ్లు మరమ్మతులకు నోచుకోలేదు, తద్వారా స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
హైదరాబాద్ పాతబస్తీలో మళ్లీ కత్తిపోట్లు కలకలం రేపుతున్నాయి. కొందరు యువకులు కలిసి ఇంటి ముందు క్యాంప్ ఫైర్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పక్కనే ఉండే వారు తమకు అల్లర్లు, గోలలతో ఇబ్బందిగా ఉందని ప్రశ్నించారు. దీంతో.. యువకులకు, వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో.. మండుతున్న క్యాంప్ ఫైర్ లోని కట్టెలతో అబ్దుల్లా ఖాన్, వసిమ్ అనే యువకులపై సమీర్, జమిర్, సయ్యద్ అనే యువకులు దాడి చేశారు. వెంటనే.. విషయం తెలుసుకున్న బాధితుల…
సోమవారం 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి ఎంపీలచే ప్రమాణం చేయించారు. ఇక ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో సందడి సందడిగా కనిపించారు.
మంత్రాలు చేస్తోందన్న అనుమానంతో ఓ మహిళపై క్రూరత్వం చూపించారు. కనికరం లేకుండా.. దాడి చేశారు. ఈ ఉదంతం ఉత్తర ప్రదేశ్లోని సూరజ్‌పూర్ ఖేడీ గ్రామంలో చోటు చేసుకుంది. అయితే.. తమ కూతురు అనారోగ్యానికి కారణం ఆ మహిళేనని.. తాను చేతబడి చేస్తుందని అనుమానించారు. దీంతో.. బాలిక కుటుంబీకులు ఆ మహిళను తీవ్రంగా కొట్టారు. అంతే కాకుండా జుట్టు కూడా కత్తిరించారు.
సూడాన్‌లో తిరుగుబాటు దళాల దాడిలో దాదాపు 150 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు, సాక్షులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడాది కాలం యుద్ధంలో ఇప్పటి వరకు 7 మిలియన్ల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
భార్యభర్తల మధ్య గొడవ.. కొడుకు ప్రాణం తీసింది. గొడవ పడొద్దని అడ్డుగా వచ్చిన తనయుడిపై తండ్రి కోపంతో దాడి చేశాడు. దీంతో.. కొడుకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ క్రమంలో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బుధవారం బెంగళూరులో జరిగింది.
శనివారం బీహార్లో చివరి దశ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే.. పోలింగ్ రోజున కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ కాన్వాయ్ పై దుండగులు గత రాత్రి తుపాకీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కేంద్రమంత్రి పాట్లీపుత్ర పార్లమెంటరీ నియోజకవర్గంలోని మసౌర్హి ప్రాంతంలో ఉన్నారు.