Pakistan : పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పాకిస్థాన్‌లోని జైష్-అల్-అద్ల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
Hyderabad: మద్యం మత్తులో పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై నానా రభస చేస్తున్నారు. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం ఓ వ్యక్తి అర్ధరాత్రి రోడ్డుపై సర్ట్ విప్పి పోలీసుల కార్ ఎక్కి హల్ చేసిన విషయం తెలిసిందే.
తన కూతురు పడొద్దని ఆ యువకుడికి ఆ తండ్రి ఎన్నిసార్లు చెప్పాడో.. చివరకు ఆవేశం ఆగక కడతేర్చాలని చూశాడు. పద్ధతి గల కుటుంబం కావున తన కూతురు వెంట ఓ యువకుడు పడుతున్నాడని నలుగురికి తెలిస్తే పరువు పోతుందనుకున్న తండ్రి.. చివరకు చంపేందుకు సిద్ధమయ్యాడు. సినిమాటిక్ టైప్ లో తన కొడుకుతో కలిసి తన కూతురు వెంటపడుతున్న యువకుడిపై దాడి చేశారు.
హౌతీ రెబెల్స్ను అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు దేశాలు హెచ్చరించాయి. ఈ దాడులు ఆపకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, అమెరికా హెచ్చరికలను హౌతీ రెబల్స్ పట్టించుకోలేదు.. మరోసారి వాణిజ్య షిప్స్ పై దాడులకు దిగింది.
Nigeria : ఉత్తర మధ్య రాష్ట్రం నైజీరియాలో జరిగిన ఊచకోతలో ఇప్పటివరకు 160 మంది మరణించారు. స్థానికులు బందిపోట్లుగా పిలిచే ముఠాలు ఆదివారం వివిధ వర్గాలపై దాడి చేశాయని స్థానిక అధికారి సోమవారం తెలిపారు.
రైతుపై దాడి చేసి చంపిన పులిని చంపాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రాణాంతక చర్యలను ఆశ్రయించే ముందు పులి నరమాంస భక్షకమని అధికారులు నిర్ధారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు.
కర్నాటకలోని బెళగావి జయనగర్‌లో బీజేపీ నేత పృథ్వీ సింగ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ చన్నరాజ్ హత్తిహోళి కత్తితో దాడి చేశారు. ఆయన నివాసానికి సమీపంలోనే ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పృథ్వీ సింగ్ చేతులు, వీపుపై గాయాలయ్యాయి. దీంతో అతన్ని బెలగావిలోని కేఎల్‌ఈ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన గొడవలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు జామెట్రీ కంపాస్తో 108 సార్లు దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.