మూడు రాజధానులపై ముందుకు వెళ్తున్న అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ… ప్రజల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగిస్తోంది.. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలతో విశాఖ గర్జన జరగగా.. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలోనూ ఉ్యమానికి శ్రీకారం చుట్టింది… తిరుపతి వేదికగా మహా ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.. ఈ సందర్భంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన ఫ్లెక్సీలు ఆవిష్కరించారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. ఇప్పుడు కాకపోతే…
అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులే తమ విధానం అంటోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే విశాఖలో పరిపాలనా రాజధాని డిమాండ్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతాలని కలుపుకుని విశాఖ గర్జన జరిగింది.. నాన్ పొలిటిక్‌జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విశాఖ గర్జనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిన వైసీపీ.. ఈ కార్యక్రమంలో మంత్రలు, పార్టీ నేతలు పాల్గొనేలా చేసింది.. ఇప్పుడు సీమలోనూ మూడు రాజధానుల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం అంటున్న జగన్మోహన్‌రెడ్డి సర్కార్..…