గత 50 రోజులుగా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న సినిమా ‘పఠాన్’. 130 సెంటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న పఠాన్ సినిమా షారుఖ్ ఖాన్ కే కాదు మొత్తం బాలీవుడ్ కే కంబ్యాక్ సినిమాగా నిలిచింది. వెయ్యి కోట్లకి పైగా రాబట్టిన పఠాన్ సినిమా బాలీవుడ్ లో బాహుబలి 2 రికార్డులని కూడా బ్రేక్ చేసి టాప్ పొజిషన్ లో కూర్చుంది. అయిదేళ్ల పాటు సినిమాలు చెయ్యకున్నా తన బాక్సాఫీస్ స్టామినా తగ్గలేదు…