గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ల హత్య జరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరిని చంపేందుకు హంతకులు ఒకరోజు ముందే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విచారణ కోసం ప్రయాగ్‌రాజ్ కోర్టుకు ఇద్దరినీ తీసుకెళ్లిన రోజునే షూటర్లు అతిఖ్, అష్రఫ్‌లను హత్య చేసేందుకు ప్రయత్నించారని సమాచారం
Atiq Ahmed Murder: గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ అతీక్ అహ్మద్ హత్యపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. జ్యూడీషియల్ కమిటీ ద్వారా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిటీతో దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది. 2017 నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన 183 ఎన్‌కౌంటర్లపై కమిటీ విచారణ జరిపించాలని పిటిషనర్ న్యాయవాది విశాల్ తివారీ కూడా కోరారు. ఇదే కాకుండా గ్యాంగ్…
Judicial Commission To Probe Atiq Ahmed Killing: దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ హత్య. శనివారం రాత్రి పోలీసుల సమక్షంలో వైద్యపరీక్షలకు వెళ్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టులుగా నటిస్తూ అత్యంత సమీపంలో నుంచి అతీక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రఫ్ అహ్మద్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.