ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన టీడీపీ - జనసేన జేఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
నాలుగున్నరేళ్లలో ఇసుక బొక్కేసి రూ. 40 వేల కోట్లు దోచిన గజదొంగ ఎవరు జగన్ రెడ్డి? కదా అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఇసుకను మీరు దోచేసి ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసు సిగ్గనిపించటం లేదా?.
చంద్రబాబుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు ఇబ్బందేంటని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ భూమ్మీద తానే అపర మేధావిని అన్నట్టు సజ్జల ఫీలవుతున్నారని ఆయన విమర్శించారు.
ఏపీ హైకోర్టు ఆదేశాలతో నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారు అని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు. దీని వల్ల పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరినీ ఆయన కలవరు అని అచ్చెన్న పేర్కొన్నారు.
పేదల గొంతు కొస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి పేరుతో టీడీపీ బ్రౌచర్ విడుదల చేశారు టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను జగన్ మోసం చేస్తున్నాడన్నారు. breaking news, latest news, telugu news, big news, atchannaidu, cm jagan
తెలుగు జాతి ఆస్తి.. దేశం ప్రపంచం నలుమూలల.. తెలిసే విధంగా మన పిల్లల్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.. చంద్రబాబు నాయుడు మీద దొంగ కేసులను, సంబంధం లేనటువంటి కేసులను బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు అంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి.. జైల్లో బంధించిన తీరును గవర్నర్ నజీర్ కు వివరించామని అచ్చెన్నాయుడు చెప్పారు. ముందు అరెస్ట్ చేసి.. ఆ తర్వాత ఆధారాలు సేకరిస్తామని సీఐడీ చేస్తున్న సిగ్గులేని వాదనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం.. చంద్రబాబుపై పెట్టిన స్కిల్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ కేసుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదని వివరించాం..
విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద 'న్యాయానికి సంకెళ్లు ఇంకెన్నాళ్లు'.. నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.