Atchannaidu: 21 బీసీ కులాల భౌగోళిక పరిమితులు రద్దు చేసిన బీసీల ద్రోహి జగన్ రెడ్డి అంటూ సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఒక కులాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేసే కుట్ర జరుగుతోంది.. బీసీలకు విద్య, వైద్యం, ఉపాధి అందకుండా చేయడమే జగన్ ఆలోచనగా ఉందని విమర్శించారు. జగన్ రెడ్డి బీసీల ద్రోహి అని మొదటి నుండి టీడీపీ చెబుతూనే ఉందన్న ఆయన.. రాష్ట్రంలోని 21 బీసీ కులాలకు భౌగోళిక పరిమితులు రద్దు చేయడమంటే వారి వెన్నెముక విరిచినట్లే అన్నారు. జీవనోపాధి కోసం పక్క ప్రాంతాలకు వెళ్లేవారి పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు.
Read Also: Uttarakhand: ఉత్తరఖండ్ టన్నెల్ ఘటన.. ఇబ్బందుల్లో పడ్డ 40 మంది జీవితాలు
జగన్ తీసుకున్న నిర్ణయంతో 21 బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని ఆరోపించారు అచ్చెన్నాయుడు.. కులాలకు ఉన్న పరిమితులు రద్దు చేయడం వల్ల విద్య, వైద్యం, రాజకీయంతో పాటు అన్ని విధాలా నష్టపోయే ప్రమాదం ఉందన్న ఆయన.. విద్యార్థులు రిజర్వేషన్లు కోల్పోతారు. విద్య పరంగా తీవ్రంగా నష్టపోతారు. ప్రస్తుతం ఉన్న విధానంతో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి..? ఒక కులాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలు చేస్తుంది ఇందుకేనా.? ఇప్పటికే స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు రద్దు చేయడం వల్ల 16,800 పదవులను బీసీలు కోల్పోయారు. బీసీలకు పీజీ చదువులకు రియంబర్స్మెంట్ రద్దు చేశారు.. విదేశీ విద్య దూరం చేశారు. కార్పొరేషన్లు నాశనం చేసి బీసీలను రోడ్డున పడేసారు. 74 మంది బీసీలను హత్య చేశారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు భౌగోళిక పరిమితులు రద్దు చేసి మరో అన్యాయానికి ఒడిగట్టారు. ఇందుకేనా నా బీసీలు అంటూ వేదికలపై ఉపన్యాసాలు..? ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకేనా కుల గణన అంటూ నాటకాలు? బీసీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న జగన్ రెడ్డికి రాజకీయంగా బీసీలే సమాధి కడతారు.. బీసీల సత్తా ఎలా ఉంటుందో వైసీపీకి చూపిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.