రాష్ట్రంలో నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా నడుస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ అంటేనే కాలువలు, చెరువులు నదులు ఆయన లేకపోతే నీటి ఎద్దడి వస్తుందని కేవలం 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించిందన్నారు. ప్రభుత్వ చేతగాని తనం వల్ల వచ్చిన కరువుగా దీనిని గుర్తించాలన్నారు. మన…
తెలుగుదేశం ఆంధ్రా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏకంగా పార్టీని పడుకోబెట్టేస్తున్నారా? గెలుపు ఊపు వచ్చిన ఉత్తరాంధ్రలో ఇప్పుడు నెగెటివ్ టాక్ ఎందుకు మొదలైంది? కనీసం పాతిక సీట్లకు తగ్గవని గొప్పగా చెప్పుకున్న చోట ఇప్పుడు నమ్మకం ఎందుకు సడలింది? పార్టీ నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయా? అసలిప్పుడు ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీకి మొదట్నుంచి బలం ఉన్న ఏరియాల్లో ఉత్తరాంధ్ర ఒకటి. మూడు రాజధానుల ఎపిసోడ్‌తో.. విశాఖను రాజధానిగా ప్రకటించినా.. వైసీపీ ఇక్కడ పట్టు సాధించలేకపోతోందన్నది…
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడికిహైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడిపై ముందస్తు చర్యలు వద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన CFMS వ్యవస్థను నాశనం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన CFMSను ముఖ్యమంత్రి కార్యాలయం ఆధీనంలోకి తీసుకుంది.. సత్యనారాయణ, ధనుంజయ్ రెడ్డిలు ఇద్దరూ కలిసి నిధులను దారి మళ్లిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసీపీకి మద్దతుగా నిలిచే…
ఈసీకి టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సజ్జలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం సలహాదారు పదవి నుంచి సజ్జలను తొలగించాలని పేర్కొన్నారు. సజ్జల ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని తెలిపారు. గత ఐదేళ్ళుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం…
చేనేత కుటుంబం బలవన్మరణానికి జగన్ రెడ్డిదే బాధ్యత అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేకనే చేనేత కుటుంబం చనిపోయింది.. బీసీల ఆస్తులను కబ్జా చేసి ఇదేమని ప్రశ్నిస్తే బలి తీసుకుంటున్నారు ఆరోపించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలింగ్ బూతులపై ప్రధాన ఎన్నికల అధికారికి రెండు లేఖలు రాశారు. పోలింగ్ బూతుల్లో తీసుకోవాల్సిన చర్యలు.. ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామి రెడ్డిపై ఫిర్యాదు చేశారు.