పేదల గొంతు కొస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి పేరుతో టీడీపీ బ్రౌచర్ విడుదల చేశారు టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను జగన్ మోసం చేస్తున్నాడన్నారు. పెత్తందారు జగన్ పేదల గొంతు కొస్తూ పాలన చేస్తున్నారని, అన్ని వర్గాలన జగన్ ఇబ్బంది పెట్టారన్నారు. బడుగుల అభివృద్ధిపై ఇన్నాళ్లూ గాఢ నిద్రలో ఉండి.. మళ్లీ మోసం చేసేందుకు బస్ యాత్ర అంటున్నారని, బడుగులను జగన్ ఊచ కోత కోశారన్నారు అచ్చెన్నాయుడు. బడుగుల హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాశారని, దారి మళ్లించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల గురించి సమాధానం చెప్పి వైసీపీ బస్ యాత్ర చేపట్టాలన్నారు అచ్చెన్నాయుడు.
Also Read : BS Yeddyurappa Security: మాజీ సీఎంకు Z+ సెక్యురిటీ.. భద్రతను పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందంటే?
అంతేకాకుండా.. ‘నిధుల్లేని.. ఆర్థిక సాయం అందించలేని కార్పోషన్లను ఏర్పాటు చేసి బీసీ కులాలను మోసం చేశారు. పుట్టినప్పట్నుంచి.. చనిపోయేంత వరకు బడుగుల కోసం చంద్రబాబు ఎన్నో పథకాలు పెట్టారు. చంద్రబాబు పెట్టిన పథకాలని జగన్ రద్దు చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లల్లో జగన్ ప్రభుత్వం బీసీ కోటాను తగ్గించేశారు. బీసీలకు అన్యాయం జరుగుతోంటే నోరు తెరిచి మాట్లాడలేని బీసీలకు మంత్రి పదవి ఇచ్చారు. ఈ మంత్రుల వల్ల బడుగు వర్గాలకు ఏం న్యాయం జరుగుతుంది..? రెడ్డి వర్గానికి చెందిన నలుగురిని జగన్ సామంత రాజులుగా చేసుకున్నారు. రాజ్యం రెడ్ల చేతుల్లో పెట్టారు. పవర్ లేని పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తే లాభమేముంది..? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలి. ఇంకెన్నాళ్లు రెడ్డిగారికి పి చేయాలని బడుగు వర్గాలకు చెందిన మంత్రులు ఆలోచించుకోవాలి. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాకే మంత్రులు బస్ యాత్ర ప్రారంభించాలి.’ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
Also Read : Pakistan : ఒక్క మ్యాచ్‌తో ఆస్ట్రేలియా రాతే మారిపోయింది.. ఇక పాకిస్తాన్‌కు సెమీస్ కష్టమే!