రాజకీయాల్లో ఉన్నవారు సేవ చేస్తారని ప్రజలు భావిస్తారు. ప్రజా ప్రతినిధులుగా ఎంపికైన ఎమ్మెల్యే, ఎంపీలు ప్రజలకు సేవ చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధనవంతులు ప్రజాప్రతినిధులుగా ఎంపికవుతున్నారు.
తనకున్న వేల కోట్ల ఆస్తులు వదిలేశాడు. భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. ఇది సినిమా బిచ్చగాడు కథ కాదు.. రియల్ బిచ్చగాడు కథ. బిచ్చగాడు సినిమాలో తన తల్లి కోసం 40 రోజులపాటు ఓ శ్రీమంతుడు బిక్షగాడిగా మారిన కథను మనందరం చూసాం.
IT Raids on Malla Reddy Assets: మంత్రి మల్లారెడ్డిపై సోదాల కేసులో ఐటీశాఖ విచారణ రెండో రోజు ముగిసింది. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి రేపు మరోసారి విచారణకు హాజరుకానున్నారు.
సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాడేజ్ కష్టాలు తీరలేదు. ఇటీవల ఆమెను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఓ కేసు విషయంలో సుదీర్ఘ సమయం విచారించింది. తాజాగా ఆమెకు చెందిన రూ. 7.27 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. రూ. 200 కోట్ల స్కామ్ లో సూత్రధారి అయిన సుకేశ్ చంద్రశేఖర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఊచలు లెక్కపెడుతున్నాడు. అతనితో సాన్నిహిత్యం ఉన్న శ్రీలంకకు చెందిన హీరోయిన్ జాక్విలిన్…
2019-20కి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులలో టీఆర్ఎస్ పార్టీ, అప్పులలో టీడీపీ టాప్‌లో ఉన్నాయి. జాతీయ పార్టీల విషయానికి వస్తే… బీజేపీకి అత్యధికంగా రూ.4,847.78 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని వెల్లడైంది. బీజేపీ తర్వాతి స్థానంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఉంది. ఆ పార్టీకి రూ.698.33 కోట్లు ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది.…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్‌లు ఆక్రమించుకున్నాక ఆ దేశానికి చెందిన నిధులను అమెరికా ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశం నిధుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విదేశాల నుంచి వచ్చే దిగుమతులు ఆగిపోయాయి. దేశంలో ఆహార సంక్షోభం తీవ్రంగా వేధిస్తున్నది. శీతాకాలంలో ఈ సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. ఆహారం, ఉద్యోగ సమస్యలు తీవ్రంగా ఉండటంతో ఆఫ్ఘన్ నుంచి ప్రజలు వలస వెళ్తున్నారు. శీతాకాలంలో ఈ వలసలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. దీంతో తాలిబన్…
ప్రధాని నరేంద్రమోదీ ఆస్తులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 3.7కోట్లకు చేరింది. ప్రతి ఏడాది ఆస్తులు, అప్పులు వివరాలను వెల్లడిస్తున్న మోడీ.. ఈ ఏడాది మార్చి 31 నాటి వివరాలను బహిర్గతం చేశారు. 2020లో 2.85కోట్లు ఉండగా.. ప్రస్తుతానికి ఆయన ఆస్తులు 22 లక్షలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి పొందే రూ. 2లక్షల జీతమే ప్రధానికి ముఖ్య ఆదాయ వనరుగా ఉంది. ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటివల్ల వచ్చే…