ఏడీఆర్ రిపోర్ట్: ఆస్తుల్లో టీఆర్ఎస్.. అప్పుల్లో టీడీపీ టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2019-20కి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులలో టీఆర్ఎస్ పార్టీ, అప్పులలో టీడీపీ టాప్‌లో ఉన్నాయి. జాతీయ పార్టీల విషయానికి వస్తే… బీజేపీకి అత్యధికంగా రూ.4,847.78 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని వెల్లడైంది. బీజేపీ తర్వాతి స్థానంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఉంది. ఆ పార్టీకి రూ.698.33 కోట్లు ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. జాతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో బీజేపీకి 69.37 శాతం ఆస్తులున్నట్లు నివేదిక పేర్కొంది.
ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే… ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీకి అత్యధికంగా రూ.563.47 కోట్ల ఆస్తులున్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ పార్టీకి రూ.301.47 కోట్ల ఆస్తులున్నాయి. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే రూ.267.61 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఫిక్సుడ్ డిపాజిట్లు, రుణాలు, ముందస్తు చెల్లింపులు, పెట్టుబడులు, ఇతరత్రా వివరాల ప్రాతిపదికన ఈ ఆస్తుల విలువ లెక్కకట్టారు.
Also Read
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
- Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
అప్పుల విషయానికి వస్తే.. జాతీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా అప్పులున్నాయి. ఆ పార్టీకి రూ.49.55 కోట్ల అప్పులున్నాయని నివేదిక ప్రకటించిది. ఆ తర్వాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ పార్టీకి రూ.11.32 కోట్ల అప్పు ఉంది. ప్రాంతీయ పార్టీలలో తెలుగు దేశం పార్టీకి అత్యధికంగా అప్పులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్టు తెలిపింది. టీడీపీకి రూ.30.34 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొంది. ఈ జాబితాలో డీఎంకే పార్టీ రూ.8.05 కోట్ల అప్పుతో రెండో స్థానంలో ఉందని వెల్లడించింది.
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!