Srilanka: వేల కోట్ల ఆస్తులు వదిలేసి భిక్షాటన.. రియల్ బిచ్చగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srilanka: తనకున్న వేల కోట్ల ఆస్తులు వదిలేశాడు. భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. ఇది సినిమా బిచ్చగాడు కథ కాదు.. రియల్ బిచ్చగాడు కథ. బిచ్చగాడు సినిమాలో తన తల్లి కోసం 40 రోజులపాటు ఓ శ్రీమంతుడు బిక్షగాడిగా మారిన కథను మనందరం చూసాం. కానీ నిజ జీవితంలో అలా జరగడం కుదరదు అని కొందరు కొట్టి పారేస్తూ ఉంటాము. కానీ ఈ వ్యక్తిని చూస్తే మాత్రం అంతకుమించి అని అనడం ఖాయం. 40 వేల కోట్ల ఆస్తులు వదిలి సన్యాసం స్వీకరించడం అంత తేలికైన విషయం కాదు. అజన్ సిరిపానో ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తాడు. 18 ఏళ్ల వయసులో తన 40,000 కోట్ల ఆస్తిని వదులుకుని బౌద్ధ సన్యాసిగా మారి 20 ఏళ్లుగా అడవుల్లోనే జీవిస్తున్నాడు. గౌతమ బుద్ధుడు రాజ్యాన్ని, సుఖాలను విడిచిపెట్టి సన్మార్గంలో నడిచేందుకు అడవులకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆయన తరహాలోనే బుద్ధుని అనుచరుడైన వెన్ అజన్ సిరిపానో అనే బిలియనీర్ తన కోట్ల సంపాదన కాదని బౌద్ధ మతం స్వీకరించి సన్యాసిగా జీవిస్తున్నాడు.
Read also:Telangana: బీసీ వృత్తిదారులకు లక్ష సాయం నేటి నుంచే..
Also Read
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
శ్రీలంక తమిళ సంతతికి చెందిన టెలికాం వ్యాపారవేత్త ఆనంద్ కృష్ణన్ కుటుంబానికి చెందినవారు సిరిపన్యో. ఆనంద్ కృష్ణన్ మెగా బిలియన్ డాలర్ల టెలికాం సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నారు. కృష్ణన్ సామ్రాజ్యంలో టెలికాం పరిశ్రమ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్, శాటిలైట్ వ్యాపారం ఉన్నాయి. కృష్ణన్‌కు కనీసం 9 ప్రధాన కంపెనీల్లో వాటా ఉంది. కృష్ణన్ మలేషియాలో మూడవ అత్యంత సంపన్నుడు. ఆనంద్ కృష్ణన్ మ్యాక్సిస్ బెర్హాల్ కంపెనీ యజమాని. ఈ కంపెనీ 2006లో, Maxis 74 శాతం వాటాను కొనుగోలు చేసి మన దేశంలో నడుస్తున్న Aircel యాజమాన్యం సైతం సొంతం చేసుకుంది. అయితే ఇది అనేక వివాదాలకు దారి తీసి ఎయిర్‌సెల్ దివాలా తీసింది. ఆనంద కృష్ణన్, టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి, అతని ఆస్తుల విలువ రూ. 40,000 కోట్ల (5 బిలియన్ డాలర్ల ) కంటే ఎక్కువ కలిగి ఉన్నారు. ఆనంద కృష్ణన్ బౌద్ధమతాన్ని నమ్మేవారు. అతని కుమారుడు సిరిపన్యో 18 సంవత్సరాల వయస్సులో బౌద్ధ సన్యాసి కావాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో సిరిపన్యో సరదా కోసం సన్యాసి జీవితాన్ని స్వీకరించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. తాత్కాలిక సన్యాసి అంటూ వెక్కిరించారు. కానీ సిరిపన్యో మాత్రం తండ్రికి కోట్లాది రూపాయల ఆస్తులున్నప్పటికీ.. సిరిపన్యో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. వెన్ అజన్ సిరిపన్యో రెండు దశాబ్దాలకు పైగా అడవులలో సన్యాసి జీవితాన్ని గడిపినట్లు చెబుతారు. అతను థాయ్‌లాండ్‌లోని డేటావో దమ్ మొనాస్టరీకి మఠాధిపతి కూడా. వెన్ అజన్ సిరిపన్యో తన తల్లి వైపు థాయ్ రాజకుటుంబానికి చెందినవాడని ప్రజలు నమ్ముతారు. వెన్ అజన్ సిరిపన్యో ప్రారంభ జీవితం అతని సన్యాస జీవితం కంటే తక్కువ ప్రసిద్ధి చెందింది. వారి విద్యాభ్యాసం గురించి సరైన సమాచారం లేదు. అతనికి బ్రిటన్‌లో ఇద్దరు చెల్లెళ్లు ఉన్నట్లు సమాచారం. వారితోనే బాల్యం గడిచిందని మీడియా తెలిసింది. సిరిపన్యోకు 8 భాషల్లో ప్రావిణ్యం ఉంది. అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!