CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- అసోం రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం
- బీజేపీ సీనియర్ నేత హిమంత సీఎంగా ప్రమాణస్వీకారం
- అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసోం రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టానికి నేడు వేదిక సిద్ధమైంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ మరోసారి అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గౌహతిలో నిర్వహించనున్న ఈ భారీ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానుండగా.. పలువురు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు.
అసోం సీఎం ప్రమాణస్వీకారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు నేడు అసోంలోని గౌహతి నగరానికి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గౌహతిలోని వెటిరినరీ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుని.. 10:15 గంటలకు జరగనున్న హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి బలాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమానికి పలువురు కీలక నేతలు హాజరవుతున్నారు. ప్రధానమంత్రి మోడీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు.
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు గౌహతి నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. అనంతరం సాయంత్రం 4:20 గంటలకు అమరావతికి చేరుకోనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో గౌహతిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో బీజేపీ స్వయంగా 82 సీట్లు గెలిచింది. మొత్తంగా ఎన్డీఏ 102 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీజేపీ అసోంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇదివరకు 2016, 2021లో కూడా అధికారంలోకి వచ్చింది.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!