Asim Munir: ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కి ఆ దేశం ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించింది. అయితే, ఆ దేశ ప్రజలు ఆసిమ్ మునీర్ ‘‘ఫీల్డ్ మార్షల్ కాదు ఫేయిల్డ్ మార్షల్’’ అంటూ విమర్శిస్తున్నారు. తాజాగా, ఆసిమ్ మునీర్ అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ఆయనకు తీవ్ర అవమానం జరిగింది. వాషింగ్టన్‌లో పాకిస్తాన్ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో…
Asim Munir: అమెరికా మిలిటరీ 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్‌లో జరుగుతున్న మిలిటరీ పరేడ్‌కి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ని అమెరికా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలను అమెరికా తోసిపుచ్చింది. ఇది తప్పుడు వార్త అని, విదేశీ సైనిక నాయకులను ఎవరూ ఆహ్వానించలేదు అని వైట్ హౌజ్ అధికారి ఒకరు చెప్పినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
USA: అమెరికా ఎప్పుడూ కూడా నమ్మకమైన మిత్రదేశంగా ఉండదనేది మరోసారి బహిర్గతమైంది. అమెరికా మాజీ అగ్రశ్రేణి దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్ ఒకానొక సమయంలో మాట్లాడుతూ.. “అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం కావచ్చు, కానీ అమెరికాకు స్నేహితుడిగా ఉండటం ప్రాణాంతకం.” అని అన్నారు. ఈ మాటలు ప్రస్తుతం అమెరికాకు చక్కగా సరిపోతాయి. భారత్‌తో ఒక వైపు వ్యూహాత్మక సంబంధాలు కావాలంటూనే, మరోవైపు పాకిస్తాన్‌కి ఎక్కడా లేని ప్రాధాన్యత ఇస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఇటీవల ఫీల్డ్ మార్షల్‌గా పదొన్నతి…
US Invited Pak Army Chief: భారత్, పాకిస్తాన్ విషయంలో మరోసారి తన వక్రబుద్దిని బయట పెట్టింది అగ్రరాజ్యం అమెరికా. తమకు ఇండియా మిత్ర దేశం అంటూనే.. వెనుక మాత్రం గోతులు తీసేందుకు భారీ ప్లాన్ వేసింది.
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధూ జలాలను ప్రస్తావిస్తూ, పాకిస్తాన్ నీటి సమస్యపై ఎప్పుడూ రాజీపడదని అన్నారు. ఎందుకంటే, దేశంలో 24 కోట్ల మంది ప్రజల ప్రాథమిక హక్కులతో ఇది ముడిపడి ఉందని చెప్పారు. గురువారం, పాకిస్తాన్‌లోని పలు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్, ప్రిన్సిపాల్స్, ఇతర ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Asaduddin Owaisi : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అందజేసిన చిత్రపటం బహుమతిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కువైట్‌లో భారతీయ ప్రవాసులతో జరిగిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో మాట్లాడిన ఓవైసీ, పాకిస్తాన్ చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని ఉద్దేశిస్తూ, “నకల్ కర్నేకే లియే అకల్ చాహియే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం.. 18 మంది మావోలు లొంగుబాటు “2019లో…
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. ఇక టర్కీ రాజధాని అంకారాలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు.
అసిమ్ మునీర్ భారత్ పై విషం కక్కుతూ పహల్గాం ఉగ్ర ఘటనకు కారణమయ్యాడు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. కాగా ఫీల్డ్ మార్షల్‌గా ఎన్నికైన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదివారం ఉన్నత స్థాయి విందు ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ నుంచి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టో వరకు, రాజకీయ, సైన్యం నుంచి అనేక మంది ఉన్నతాధికారులు విందులో…
S Jaishankar: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదులే టార్గెట్‌గా ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ తర్వాత పాక్ జరిపిన వైమానిక దాడుల్ని తిప్పికొట్టింది. భారత దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 11 కీలకమైన ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాల తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ డచ్ మీడియాకు బుధవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంట్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునిర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆసిమ్…
పాకిస్థాన్ లో సైన్యానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య లోతైన సంబంధం ఉందని మరోసారి స్పష్టమైంది. ఇటీవల, సింధ్ ప్రావిన్స్‌లోని మట్లి ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాది రజౌల్లా నిజామాని అలియాస్ సైఫుల్లా గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. సైఫుల్లా మరణం పట్ల పాకిస్థాన్ మర్కజ్ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) సింధ్ యూనిట్ సంతాప సమావేశం నిర్వహించింది.