కశ్మీర్ భూమిపై మరోసారి భారతీయుల రక్తం చిందింది. సెలవుల్లో ఆహ్లాదంగా గడుపుదామని పహల్గామ్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృత్యుఒడికి చేరుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంటల్లో భర్త కాటికి, భార్య సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటివరకు కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా దీనిని పరిగణిస్తున్నారు. ఇందులో 28 మంది మరణించినట్లు సమాచారం. అయితే.. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది.…
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. కాశ్మీర్ అందాలు చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని టార్గెట్ చేసి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ప్రస్తుతం వస్తున్న వివరాల ప్రకారం, 27 మంది వరకు టూరిస్టులు ఈ దాడిలో మరణించినట్లు సమాచారం.
కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ తరచూ నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. తాజాగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్.. కశ్మీర్‌పై నోరు పారేసుకున్నారు. కశ్మీర్ పాకిస్థాన్‌కు జీవనాడని, భవిష్యత్తులోనూ అది అలాగే ఉంటుందని, దానిని మేము వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ అంశంపై భారత ప్రభుత్వం స్పందించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్ తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. ‘‘విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది..? కశ్మీర్ భారత భూభాగం’’ అని తేల్చిచెప్పింది.
Pakistan: వరస దాడులతో పాకిస్తాన్ కుదేలవుతోంది. బలమైన ఆర్మీ అని పైకి చెప్పుకుంటున్నప్పటికీ పాక్ ఆర్మీ బలం ఇటీవల ఘటనలతో తేలిపోయింది. ముఖ్యంగా బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషర్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులకు, మరోవైపు ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబాన్ల దాడులకు తట్టుకోలేకపోతోంది. మొన్నటికి మొన్న బలూచిస్తాన్‌లో ట్రైన్ హైజాక్ చేసిన బీఎల్ఏ ఏకంగా 200కి పైగా ఆర్మీ, ఐఎస్ఐ ఆఫీసర్లను చంపేసింది. ఆ తర్వాత భద్రతా బలగాల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 90 మందిని హతమార్చింది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌కి అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. సోమవారం యూఎస్ కాంగ్రెస్‌లో జో విల్సన్ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. మాజీ సెనెటర్ తన ఫిబ్రవరి డిక్లరేషన్‌లో, సోమవారం అమెరికన్ పార్లమెంట్లో ‘‘పాకిస్తాన్ డెమోక్రసీ యాక్ట్’’ని తీసుకువచ్చారు.
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు, ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. బెలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బలూచ్ ప్రావిన్సుల్లో పనిచేయడానికి ఆర్మీ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు భయపడి చస్తున్నారు.
Pakistan: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఘర్షణతో అట్టుడికిపోతోంది. గత 24 గంటల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 23 మంది ఉగ్రవాదులు మరణించారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పరిణామాలను సమీక్షించేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బలూచిస్తాన్ వెళ్లారు.
Pulwama attack architect Asim Munir to be Pakistan's new army chief: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ నియమిలయ్యారు. ప్రస్తుతం సైన్యాధ్యక్షుడిగా ఉన్న కమర్ జావేద్ బజ్వా నుంచి ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే భారత్ అంటే నరనరాన వ్యతిరేకత ఉన్న వ్యక్తి ఆసిమ్ మునీర్. ఇప్పటి వరకు పాకిస్తాన్ కు నియమితులైన ఏ సైన్యాధ్యక్షుడు కూడా భారతదేశంతో సత్సంబంధాలను కోరుకోలేదు. దీనికి అనుగుణంగానే మునీర్…