భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ట్రోఫీ కాంట్రవర్సరీ రోజురోజుకూ పెరుగుతుందే తప్ప.. సమస్యకు పులిస్టాప్ పడడం లేదు. అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఇటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తగ్గేదేలే అంటుండడంతో సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీనే. నఖ్వీ నాటకాల కారణంగా ఫైనల్ ముగిసి దాదాపు…
ఆసియా కప్ 2025 ట్రోఫీ కాంట్రవర్సరీపై తెలుగు ఆటగాడు, టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ స్పందించాడు. సెప్టెంబర్ 28న పాకిస్థాన్‌తో ఫైనల్ అనంతరం తాము గంటసేపు మైదానంలోనే గడిపాము అని, గ్రౌండ్‌లో ట్రోఫీ ఎక్కడా కనిపించలేదని చెప్పాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతిలో ట్రోఫీ లేదని చెప్పాడు. అందుకే ట్రోఫీ అందుకొన్నట్లుగా తాము క్రియేట్ చేశాం అని తిలక్ తెలిపాడు. ఫైనల్‌లో భారత్ గెలిచినా.. నఖ్వీ ఇప్పటివరకు ట్రోఫీ…
Asia Cup Trophy Controversy: ఆసియా కప్ ట్రోఫీ "దొంగ" అయిన పాకిస్థాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీని బీసీసీఐ వదిలిపెట్టే స్థితి కనిపించడం లేదు. ఇంతలో మరో ప్రధాన వార్త వెలువడింది. ACC అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేశారు. అయితే.. ఈ ట్రోఫీని టీం ఇండియాకు ఎప్పుడు అందజేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్ 2025లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పీసీబీ చీఫ్, ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ప్లేయర్స్ తిరస్కరించారు. దాంతో నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు దక్కాల్సిన విజేత పతకాలను కూడా హాటల్‌కు తీసుకెళ్లిపోయాడు. దాంతో పీసీబీ, బీసీసీఐ మధ్య వివాదం చెలరేగింది.…