ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో శనివారం (మార్చి 29) జరిగే మ్యాచ్ నంబర్-9లో గుజరాత్ టైటాన్స్ (GT), ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్‌లో గుజరాత్ తన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)తో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరోవైపు, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్…
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆటగాడు ఆశిశ్ నెహ్రా ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా ఐపీఎల్ వేలంలోకి వస్తే.. అద్భుతమే జరిగేదని, ప్రాంచైజీలకు రూ.520 కోట్ల పర్స్ ఉన్నా సరిపోదన్నాడు. అతడిని ఓడించడం ఎవరి వల్ల కాదని నెహ్రా చెప్పుకొచ్చాడు. 2013 నుంచి బుమ్రా ముంబై ఇండియన్స్ ప్రాంచైజీకి ఆడుతున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఈ 11 ఏళ్లలో ముంబై ఒక్కసారి కూడా బుమ్రాను వేలంలోకి విడిచిపెట్టలేదు. అంటే అతడికి ఎంత…
Ashish Nehra slams Gautam Gambhir: భారత జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ టూర్‌లో టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది. అయితే ఈ పర్యటనతోనే కోచ్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టిన గౌతమ్ గంభీర్‌కు ఈ టూర్ ప్రత్యేకం అని చెప్పాలి. జట్టు ఎంపికలో తన మార్క్ చూపించిన గంభీర్.. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్…
Ashish Nehra reacts on Hardik Pandya’s T20 Captaincy Snub: హార్దిక్ పాండ్యాను టీ20ల్లో కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ భారత జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం తనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. క్రికెట్‌లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని, నయా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఆలోచనా విధానాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పాడు. హార్దిక్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాలా ముఖ్యమైన ఆటగాడని, అదనపు ఫాస్ట్ బౌలర్‌గా…
Ashish Nehra rejects India Coaching offer: భారత్ క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వన్డే ప్రపంచకప్2023తో ముగిసింది. టీమిండియా కోచ్‌గా మరో దఫా కొనసాగాలని మెగా టోర్నీకి ముందే బీసీసీఐ ద్రవిడ్‌ను కోరింది. అయితే మిస్టర్ డిపెండబుల్ అందుకు సానుకూలంగా లేకపోవడంతో.. బీసీసీఐ మరో సరైన వ్యక్తిని వెతికే పనిలో పడింది. ఈ లోగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పజెప్పింది. టీమిండియా…
Ashish Nehra To Become India Head Coach After Rahul Dravid: బీసీసీఐతో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల ఒప్పందం ప్రపంచకప్ 2023 అనంతరం ముగియనుంది. ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధిస్తే.. మరోసారి ద్రవిడ్‌ని హెడ్ కోచ్ పదవిలో కొనసాగిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవేళ భారత్ టైటిల్ గెలువకుంటే.. ద్రవిడ్‌పై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. ఎందుకంటే అండర్-19లో మాదిరి అంతర్జాతీయ క్రికెట్‌లో ‘ది వాల్’ ఇప్పటివరకు తనదైన ముద్ర…
టీమిండియా జట్టుకు ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్ ఉంటే బాగుంటుందని గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. దీనిని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సమర్థించాడు. టీమిండియా టీ20 కోచ్‌గా పేస్ దిగ్గజం ఆశిష్ నెహ్రా సరిగ్గా సరిపోతాడని హర్భజన్ సింగ్ భావిస్తున్నాడు. ఎందుకంటే అతనికి ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కంటే పొట్టి ఫార్మాట్ బాగా తెలుసు అని అన్నాడు.
టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చాహల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీనియర్ కమ్ కోచ్ అయిన నెహ్రా చాహల్‌తో క్లోజ్‌గా ఉంటాడు. అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం ఓ పార్టీలో మద్యం సేవించగా.. అనంతరం రోడ్డు మీద ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పార్టీ అయిపోయిన తర్వాత చాహల్‌ను నెహ్రా ‘అరే బస్‌లో వెళ్దాం రా’ అంటే…
టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఐపీఎల్‌లో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఫస్ట్ ఇండియన్ హెడ్ కోచ్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకూ షేన్ వార్న్, డారెన్ లెమాన్, రికీ పాంటింగ్, ట్రెవర్ బేలిస్, టామ్ మూడీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, జాన్ రైట్, జయవర్ధనే వంటి విదేశీ హెడ్ కోచ్‌ల నేతృత్వంలో ఆయా జట్లు ఐసీఎల్ టైటిల్స్ గెలుచుకున్నాయి. అయితే.. తొలిసారి భారత హెడ్ కోచ్ నేతృత్వంలో ఓ జట్టు ఐపీఎల్…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భారత ప్రయాణంతో పాటుగా… టీ20 ఫార్మాట్ లో ఇండియా జట్టుకు కెప్టెన్ గా కోహ్లీ ప్రయాణం కూడా ముగిసిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాదే మరో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఉండటంతో.. ఆ జట్టులో విరాట్ కోహ్లీ తప్పకుండ ఉండాలని భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. విరాట్ కోహ్లీ కంటే మెరుగ్గా బ్యాటింగ్ ఆర్డర్‌కు స్థిరత్వాన్ని ఎవరు అందించలేరని నెహ్రా సూచించాడు. మీరు కోహ్లీని…