IND vs SL: కోహ్లీ, రోహిత్ అవసరం లేదు.. ఆశిశ్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
- శ్రీలంక పర్యటనలో భారత జట్టు
- గంభీర్‌కు శ్రీలంక టూర్ ప్రత్యేకం
- ఆశిశ్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashish Nehra slams Gautam Gambhir: భారత జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ టూర్‌లో టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది. అయితే ఈ పర్యటనతోనే కోచ్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టిన గౌతమ్ గంభీర్‌కు ఈ టూర్ ప్రత్యేకం అని చెప్పాలి. జట్టు ఎంపికలో తన మార్క్ చూపించిన గంభీర్.. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అందుబాటులో ఉండాలని కోరాడు. గౌతీ విజ్ఞప్తి మేరకు వారిద్దరూ వన్డే సిరీస్ ఆడుతున్నారు. అయితే వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఆడాల్సిన అవసరం లేదని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిశ్ నెహ్రా అభిప్రాయపడ్డాడు.
Also Read: Gold Rate Today: ‘గోల్డెన్’ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! కిలో వెండిపై రూ.3200 తగ్గింది
Also Read
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఇదే మంచి అవకాశమని ఆశిశ్ నెహ్రా పేర్కొన్నాడు. ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఆడించకుండా ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి శ్రీలంక వన్డే సిరీస్ రూపంలో మంచి అవకాశం దొరికింది. గౌతమ్ గంభీర్ కొత్త కోచ్ అని తెలుసు. అతను అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కొంత సమయం గడపాలని అనుకున్నాడు. కానీ కోహ్లీ, రోహిత్ గురించి గంభీర్‌కు తెలియంది ఏముంది?. అతడేమీ విదేశీ కోచ్ కాదు కదా. కొత్త ఆటగాళ్లను ప్రయత్నించడానికి గౌతీకి ఇది మంచి అవకాశం. ఇప్పుడు రెస్ట్ ఇచ్చి స్వదేశంలో సిరీస్‌లు ఉన్నపుడు రోహిత్, కోహ్లీలను ఆడించొచ్చు. గంభీర్ నిర్ణయాలు తప్పని నేను అనడం లేదు. సిరీస్‌లో ఇది ఓ వ్యూహం అయి ఉండొచ్చు’ అని నెహ్రా అన్నాడు.
తాజావార్తలు
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!