ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. సీఎం నివాస పునరుద్ధరణ కేసులో సీబీఐ కేసు నమోదు చేయడమే కారణం. ఢిల్లీ సీఎం నివాసం పునరుద్ధరణలో జరిగిన కుంభకోణంపై కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది.
బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జవాన్ల బలిదానాలకు యావత్ దేశం దుఃఖించిందని.. మన సైనికులు అమరులైన సమయంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడం మరింత బాధాకరమన్నారు.
పంజాబ్ లో పరిశ్రమ, వాణిజ్యాన్ని విస్తరించడానికి కృషి చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రపంచం పురోగమిస్తోంది కానీ.. పంజాబ్ ఇప్పటికి వెనుకపడి ఉంది. ఇప్పుడు మనం దానిని మార్చాలన్నారు. ఆప్ ప్రభుత్వం ఏర్పాటైన ఐదేళ్లలోపు దీని సంఖ్యను 2 వేల యూనిట్లకు పెంచుతామన్నారు.
G20 Summit 2023: జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ నేతల రాక ప్రక్రియ ప్రారంభమైంది. అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ ఢిల్లీ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ విమానంలో బయలుదేరి సాయంత్రంలోగా భారత్ చేరుకోనున్నారు.
Arvind Kejriwal: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇండియా పేరును ‘రిపబ్లిక్ ఆఫ్ భారత్’ని మారుస్తుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ 18-22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని పదవి రేసులో లేరని ఢిల్లీ మంత్రి అతిషి బుధవారం అన్నారు. కేజ్రీవాల్ దేశానికి ఆదర్శప్రాయమైన ప్రధాని కాగలరని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ చేసిన వ్యాఖ్యలపై అతిషి స్పందిస్తూ .. ఇది ప్రధాన ప్రతినిధి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని.. కానీ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని రేసులో లేరన్నారు.
ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం బీహార్‌లో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికను ప్రకటించింది. ఈ చర్య 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఐక్యతను మరింత తగ్గించనుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో తమ పార్టీ మార్పు తీసుకువస్తుందని ఆయన అన్నారు.