ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఈడీ జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ కోర్ట్ ఆఫ్ రూస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. హాజరు మినహాయిపు కోసం ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని కేజ్రీవాల్ లాయర్లకు సెషన్స్ కోర్టు సూచించింది.
లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు పలుమార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. దాదాపుగా ఎనిమిది సార్లు సమన్లు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయన హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. విచారించిన సెషన్స్ కోర్టు అందుకు నిరాకరించింది.
ఈడీ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు కేజ్రీవాల్‌కు సమన్లు ఇచ్చింది. ఏ సమన్లకు కేజ్రీవాల్ స్పందించలేదు. వర్చువల్‌గా విచారణకు హాజరవుతానని ఇటీవల ఈడీకి కేజ్రీవాల్ తెలియజేశారు. దీనికి ఎలాంటి స్పందన రాలేదు.
ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల ముందు ఆప్‌ను వేధించడానికే ఈడీని అడ్డంపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని ఆప్ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. సీబీఐ ద్వారా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందని ఇటీవల ఆప్ మంత్రులు కూడా విమర్శించారు.
Sessions Court of Rouse Avenue Court refuses to stay summons issued to Delhi Chief Minister Arvind Kejriwal on the basis of complaints filed by the Enforcement Directorate (ED).
Kejriwal has challenged the summons issued by the Magistrate court after taking cognizance of two… pic.twitter.com/HjwNATqpyF
— ANI (@ANI) March 15, 2024