Arun Goel: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామానాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం భారమంతా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌పై పడింది. లోక్‌సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం వస్తుందనే వార్తల నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం అరుణ్ గోయెల్ లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.