జర్నలిస్టులపై జరుగుతున్న అగాయిత్యలపై జాతీయ బీసీ కమీషన్ సభ్యులు టీ. ఆచారి ఫైర్ అయ్యారు. జర్నలిస్ట్ రఘును తీవ్రవాదిలా రిక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసి అరెస్ట్ చేయటంపై నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇలా వ్యవహరించటం సిగ్గుచేటు అని..చట్టాన్ని రక్షించాల్సిన వారే అడ్డదారిలో వెళ్ళటం ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు అని మండిపడ్డారు. కేసులో ముద్దాయిగా ఉంటే నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు అని..గతంలో ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావ్ ను కూడా ఖమ్మంలో కిడ్నాప్ చేసి అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. అదే రోజు కొల్లాపూర్ లో అవుట రాజశేఖర్ వార్తలు ప్రచురించాడని స్టేషన్ లో దారుణంగా చిత్రహింసలు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తెలంగాణలో మానవ హక్కులు లేవా…? ఈ విషయంలో జిల్లా SP, జిల్లా కలెక్టర్ లకు ఈ నెల 21వ తేదీన ఢిల్లీకి రావాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణా రాష్ట్రము వచ్చిన తరువాత పోలీసులు ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరించడం దేనికి నిదర్శనమని… ఇవి మంచి పరిణామాలు కావన్నారు. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తూ పాలన కొనసాగించగలరా..? జర్నలిస్టు లను వీధి రౌడీలుగా బావిస్తున్నారా..? అని ఫైర్ అయ్యారు.