బంజారాహిల్స్ లో ఓ నకిలీ ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయ్యాడు. ఖమ్మం సిఐ పేరుతో ఒక వైద్యుడుకి ఫోన్ చేసి 75 లక్షలు డిమాండ్ చేసాడు నిందితుడు. గతంలో తన ఇంట్లో డ్రైవర్ గా పని చేసాడు మహేష్ అనే వ్యక్తి. అయితే మహేష్ వద్ద వైద్యుడుకి సంబందించిన కాల్ రికార్డింగ్ లు ఉండటంతో అతడిని విధుల్లో నుండి తొలగించాడు వైద్యుడు. మహేష్ తనకు తెలిసిన వ్యక్తి తో నకిలీ పోలీస్ అవతారం ఎత్తించి వైద్యుడికి ఫోన్ చేయించాడు.…
అంగన్వాడీ పాల అక్రమరవాణా కేసులో 26 మంది అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. గతనెల 3వ తేదీన శ్రీకాకుళం భామిని మండలం బత్తిలిలో 1919 లీటర్ల పాల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. పాలు అక్రమ రవాణా చేస్తున్న వాహనం సీజ్ చేసి , ఐదుగురిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ పాల అక్రమరవాణా కేసులో 40 రోజుల పాటు పోలీసులు దర్యాప్తు కొనసాగించగా విచారణలో వీరఘట్టం, వంగర మండలాలకు చెందిన 28 మంది అంగన్వాడీ కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు…
భారీ కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. పంద్రాగస్టు వేడుకల ముందు నలుగురు నిందితులను ఢిల్లీ స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 55 పిస్టల్స్, 50 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. సాత్వంత్ర్య దినోత్సవం సంద్భంగా… ఢిల్లీ మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాజ్‌వీర్ సింగ్, ధీరజ్, వినోద్ భోలా, ధర్మేంద్ర అనే నలుగురు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.…
నగరంలో ఈ మధ్య కాలంలో బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంతమంది ముఠాలుగా ఏర్పడి బైక్ చోరీలకు పాల్పడుతున్నారు అని సీపీ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. ఆరు స్టేషన్ ల పరిధిలో జరిగిన బైక్ దొంగతనల్లో 27 మందిని అరెస్ట్ చేసాం. బైక్స్ దొంగతనం చేసిన ముగ్గురు నిందితుల్లో విజయనగరం జిల్లా గంట్యాడ ప్రాంతనికి చెందిన మాలోతు ఎర్రన్నాయుడు తో పాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేసాం. వీరితో పాటు దొంగిలించిన బైక్స్ కొనుగోలు…
చెన్నై నగరంలోని ఓ ఫామ్ హౌస్‌లో మందు పార్టీలో అశ్లీల నృత్యాలు చేసిన ఓ టీవీ నటి సహా 15 మంది యువతీయువకులను పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి దూరంగా ఉన్న కానత్తూరు ఫామ్ హౌస్‌లలో మందు పార్టీలు, బుల్లితెర నటీనటుల అశ్లీల నృత్యాలు జరుగుతున్నట్టు పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో నృత్యకార్యక్రమాల్లో పాల్గొన్న యువతీయువకులు ఫామ్‌హౌస్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటాడి టీవీ నటి సహా 15 మంది యువతీయువకులను…
తెలంగాణలో రోజుకో ఫేక్ పోలీస్ పుట్టుకొస్తున్నాడు. మొన్న నకిలీ డీస్పీ స్టోరీ మరిచిపోక ముందే మరో ఇద్దరు ఫేక్ పోలీసులు దొరికిపోయారు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ ఖాకీల అసలు రంగు బయట పడింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్టేషన్ పరిధిలో మొత్తం ముగ్గురు నకిలీ పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SOT పోలీసుల పేరుతో గత కొంతకాలంగా స్థానికులను బెదిరించి, డబ్బులు వసూలు చేస్తున్నట్టు…
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమంలో…చాలా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అంబేద్కర్ విగ్రహం వైపు ర్యాలీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయలు దేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇందిరా పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. read also : సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ ధర్నాచౌక్ నుంచి కాంగ్రెస్ నేతలు బయటకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు పోలీసులు. కార్యకర్తల భుజాలపై ఎక్కి…
ఓటీటీ కంటెంట్ ను కాపీ కొడుతున్న హైదరాబాద్ కు చెందిన ఓ ఐటీ ఇంజనీర్ సతీష్ వెంకటేశ్వర్లును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ముంబై కోర్ట్ లో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, తదితర ఓటీటీల కంటెంట్ లను నిందితుడు దొంగిలిస్తున్నాడు. తోప్ టీవీ ద్వారా ఫ్రీగా విడుదల చేస్తున్నాడు. గుర్రంగూడలో నివసిస్తున్న సతీష్.. రెండేళ్లుగా తోప్ టీవీని నడుపుతున్నాడు. వాయ్…
కర్నూలు పెసరవాయి జంట హత్య కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసారు. రాజా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కేధార్ నాద్ రెడ్డి తో పాటు మరో ఆరుమందిని అరెస్టు చేసి వారిని నంద్యాల కోర్టుకు తరలించారు పోలీసులు. ఈనెల 17న గడివేముల మండలం పెసరవాయిలో హత్యకు గురైన టీడీపీ నేతలు వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిలను రెండు వాహనాలతో ఢీకొట్టి వేటకొడవళ్ళతో నరికి చంపారు నిందితులు. గ్రామంలో అధిపత్యం, కుటుంబాల మద్య పాత…
డ్రగ్స్ రవాణాలో ఇప్పుడు ఏకంగా విమానాలను ఉపయోగిస్తున్నారు కేటుగాళ్లు.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో సారి భారీగా డ్రగ్స్ పట్టివేశారు.. డర్బన్ నుండి ఢిల్లీ వచ్చిన టాంజానియా దేశస్తుడి నుండి 28 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను గుర్తించారు కస్టమ్స్ అధికారులు.. హెరాయిన్ డ్రగ్‌ను హాండ్ బ్యాగ్, ట్రాలీ బ్యాగ్ లో ప్రత్యేకంగా రంద్రాలు చేసి అందులో నింపాడు కేటుగాడు. ఢిల్లీ విమనాశ్రయంలో ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అతని లగేజ్ బ్యాగ్‌ను క్షుణంగా తనిఖీ చేసింది…