ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ పేరుతో మల్లీ లెవల్ మార్కెంట్ అంటూ 10 లక్షల మందిని మోసం చేశారు. మాయమాటలు చెప్పి 15 వేల కోట్లు దండుకున్నారు. ఈ ఘటన ఈ సంవత్సరం మార్చిలో వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా ఇండస్ వివా చైర్మన్‌ను అరెస్ట్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) అధికారులు తెలిపారు. కొనాళ్లక్రితం ఇండస్ వివాలపై కేసు నమోదు కావడంతో ఆ కంపెనీకి చెందిన 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పడు…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా మూడు పువ్వులు-ఆరు కాయలుగా వర్థిల్తుతోంది. ఏదో ఒక చోట, ఏదో ఒక విధంగా గంజాయిని అక్రమరవాణా చేస్తూ కేటుగాళ్ళు పట్టుబడుతున్నారు. సంగారెడ్డిలో ప్రొహిబీషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. కంది, చేర్యాల గ్రామం ,రుద్రారం,భానూరు, వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో గంజాయి లభ్యం అయింది. చేర్యాల గ్రామానికి చెందిన సాయినాథ్ రెడ్డి , భానూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తుల నుండి…
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్‌నెం 2 లో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోహిత్ అనే వ్యక్తి తాగినమత్తులో అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కారు దూసుకెళ్లడంతో బీహార్‌కు చెందిన త్రిభువన్‌రాయ్, ఉపేందర్‌కుమార్ దాస్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు వెంటనే రోహిత్‌ను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రోహిత్‌ను అదుపులోకి…
గుంటూరు నగరంలో చైన్ స్నాచింగ్‌ల ముఠా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ముఠాపై ప్రత్యేక నిఘా పెట్టింది పోలీస్ శాఖ. గుంటూరులో వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్ని గుట్టురట్టు చేశారు పోలీసుల వారిని అరెస్ట్ చేశారు. 90 ఏళ్ళ ఓ వృద్ధురాలు మెడలో గొలుసు లాక్కొని పరారీ అయ్యాడో నిందితుడు. ముద్దాయిపై గతంలో 8 కేసులు ఉన్నాయి. దొంగిలించిన చైన్ ను లాడ్జి లాకర్ లో భద్రపరిచాడు నిందితుడు.…
హైదరాబాద్‌లో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు చాంద్రాయణగుట్ట పోలీసులు. నిందితులను అరెస్టుచేసి విచారణ చేస్తుండగా వెల్లడించిన విషయాలతో పోలీసులు అవాకయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హరియానాకు చెందిన ఓ గ్యాంగ్ ఎస్‌బీఐ ఏటీఏంలనే టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. 27 మంది బంధువులకు సంబంధించి ఫేక్ అకౌంట్స్ సృష్టించిన ఈ గ్యాంగ్.. ఏటీఎంలో డబ్బులు డ్రాచేస్తున్నప్పుడు డబ్బులు వచ్చే సమయానికి పెన్, స్టిక్ అడ్డుపెట్టి సాంకేతిక సమస్యలు సృష్టించేవారు.…
కడప జిల్లా : మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా…. ఉన్న దేవి రెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. దేవి రెడ్డి శంకర్ రెడ్డిని ఇవాళ మధ్యాహ్నం అదుపు లోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని అదపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. దేవి…
నల్లగొండ జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఊహించన షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు నల్గొండ పోలీసులు. బండి సంజయ్ కుమార్ తన పర్యటనకు అనుమతి తీసుకోలేదని… ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతి లేకుండా పర్యటన సరికాదన్నారు జిల్లా ఎస్పీ రంగనాథ్. నిన్నటి బండి సంజయ్ నల్గొండ జిల్లా…
అసలే లేడీ కిలాడీలు. నేరాల్లో ఆరితేరిపోయారు. ఏ చిన్న అవకాశాన్నీ వారు వదలరు. కోట్లు విలువ చేసే హెరాయిన్ స్మగ్లింగ్ చేశారు. చాలా బాగా మేనేజ్ చేశారు. కానీ హైదరాబాద్ కస్టమ్స్ అధికారుల ముందు వారి ఆటలు సాగలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఇద్దరు మహిళా ప్రయాణీకులను అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. హెరాయిన్ ని తాము వెంట తెచ్చుకున్న ట్రాలీ బ్యాగ్…
బట్టతలను కవర్ చేసి విగ్గూ పెట్టుకొన్ని మోసాలకు పాల్పడుతున్న కార్తీక్ వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తానొక ఎన్‌ఆర్‌ఐ అంటూ…మహిళలను ట్రాప్ చేసేవాడు కార్తీక్. తన వివాహం కాలేదని చెప్పి విగ్గుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేవాడు కార్తీక్ వర్మ. అయితే.. ఆ అందమైన కార్తీక్ వర్మ ఫోటోలు చూసి వలలో పడుతున్నారు అమ్మాయిలు. ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను మోసం చేసిన కార్తీక్ వర్మ .. అమ్మాయిలతో…
ఓ కంపెనీకి సంబంధించి నకిలీ భూ పత్రాల సృష్టించి మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేఖర్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని మూసాపేటలో గల ఓ కంపెనీకి చెందిన స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించాడు. 1500 గజాల స్థలానికి ఫేక్ పత్రాలు సృష్టించి ఆ స్థలానికి అమ్ముతానంటూ.. ఓ వ్యక్తి దగ్గరి నుంచి రూ.1.10 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాడు. నకిలీ పత్రాలుగా గుర్తించిన బాధితుడు.. మోస పోయినట్లు గ్రహించి…