అమ్మాయిని మోసం చేసినందుకు ఒడియా టెలివిజన్ సీరియల్ నటుడు ఎం సుమన్ కుమార్ కు పోలీసులు సినిమా చూపించారు. పెళ్లి సాకుతో అమ్మాయిని మోసం చేసి, శారీరక సంబంధం పెట్టుకున్న సుమన్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. సదరు అమ్మాయి ఆరోపణ ప్రకారం ముందుగా ప్రేమిస్తున్నాను అని నమ్మించి, సాన్నిహిత్యం పెంచుకున్నాడు. పెళ్లి అనేసరికి మొహం చాటేశాడు. ఆమె ఎంత ట్రై చేసినా సుమన్ వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో ఆ అమ్మాయి స్థానికంగా ఉన్న పహాలా పోలీసులకు…
పెందుర్తి మండలం సత్తివాని పాలెంలో రెవెన్యూ అధికారులపై దాడి చేసిన వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే భూకబ్జా, రెవెన్యూ ఉద్యోగులపై దౌర్జన్యం కేసులో పరారీలో ఉన్న వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 3 రోజులుగా దొడ్డి కిరణ్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. రాజమండ్రిలో దొడ్డి కిరణ్ ని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం దొడ్డి…
గుంటూరు జిల్లాలో సంచలనంగా మారిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతను అరెస్ట్ చేశారు పోలీసులు.. బాలికపై అత్యాచారం కేసులో వైసీపీ నేత కన్నా భూశంకర్ ని అరెస్ట్ చేసిన అరండల్‌పేట పోలీసులు.. భూ శంకర్ తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెబుతున్నారు.. ఇక, ఇదే కేసులో గతంలో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజా అరెస్ట్‌లతో కలిసి మొత్తం అరెస్ట్ అయినవారి సంఖ్య 24 మందికి…
విజయవాడలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ నేత బుద్దా వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.విజయవాడ వన్ టౌన్ పీఎస్ కు బుద్దా వెంకన్నను తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు అడ్డుపడ్డారు టీడీపీ కార్యకర్తలు.. బుద్దా అనుచరులు. బుద్ధా వెంకన్నపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 153, 505, 506 సెక్షన్ల కింద FIR నమోదయింది. బుద్దాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మైలవరపు దుర్గారావు. కాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని,…
నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని అమ్మటివారి పాలెంలో జరిగిన జంట హత్యల కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. తల్లి షేక్ మీరా, కొడుకు షేక్ అలిఫ్ లని మండలంలోని పొలంపాడు గ్రామానికి చెందిన రబ్బానీ హత్య చేసినట్లుగా కావలి అడిషనల్ ఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. ఒకే రోజు ముగ్గురి హత్యకు నిందితుడు రబ్బానీ ప్రణాళికల రూపొందించినట్లు కావలి అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తెలిపారు. కలిగిరిలో షేక్ మీరా, ఆమె కుమారుడు షేక్ అలిఫ్ ను హతమార్చిన…
హైడ్రామాల నడుమ బండి సంజయ్ దీక్ష భగ్నం చేశారు పోలీసులు. బండి సంజయ్ ని అరెస్టు చేసి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అడ్డుకున్న కార్యకర్తలపై నిర్దాక్షిణ్యంగా లాఠీలు ఝుళిపించారు పోలీసులు. తలకు గాయమై రక్తం కారుతున్నా పట్టించుకోకుండా బండి సంజయ్ ను తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించారు పోలీసులు. దీంతో బండి సంజయ్ కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అంతకుముందు ఆఫీస్ తలుపులు పగులగొట్టి లోపలికెళ్లిన పోలీసులు బండి సంజయ్ ని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేశారు.…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని… పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆయనను అరెస్టు చేశారు పోలీసులు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవేల్లి లో… రచ్చబండ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి భారీ బందోబస్తుతో ఆయన ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. పోలీసులు ఎట్టకేలకు…
మహారాష్ట్రలోని నాగపూర్‌లోని యశోధరానగర్‌లో వరసగా వాహనాలు దొంగతనానికి గురవుతుండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరసగా ఫిర్యాదులు అందుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు ఈకేసులో నలుగురికి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 వాహనాలును రికవరి చేసేశారు. అయితే, పదో వాహనం గురించి సర్పరాజ్ అనే దొంగను ప్రశ్నించగా, అతను చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. చలి బాగా పెరిగిపోవడంతో బైక్‌కు నిప్పు అంటించి చలికాసుకున్నామని చెప్పాడు. దొంగచెప్పన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. నలుగురు…
హైదరాబాద్‌లో ఘరానా మోసగాడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా రెండు వందల మంది అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు. న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. కొంతమందిని లొంగదీసుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు. ఐతే…ఎవరూ ఫిర్యాదు చేయకపోవటంతో ఈ వ్యవహారం కొంతకాలం పాటు సాగిపోయింది. ఓ బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించటంతో ఈ బండారం బట్టబయలైంది. హైదరాబాద్‌లో కామాంధుడిని అరెస్ట్ చేసి..రిమాండ్‌కు తరలించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా…
ఈ నెల 9న ఢిల్లీలోని రోహిణి కోర్టులో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. డీఆర్డీవోకు చెందిన భరత్ భూషణ్ అనే శాస్త్రవేత్తకు తన పక్కింట్లో ఉండే న్యాయవాది అమిత్ విశిష్ట్ కు మధ్య గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు ఒకరిపైఒకరి కేసులు పెట్టుకున్నారు కూడా. అయితే లాయర్‌ను ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు…