టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Peddapalli: పెద్దపెల్లి పార్లమెంట్ స్థానంలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 15 లక్షల 96 వేల 430 కాగా.. పోలైన ఓట్లు 10 లక్షల 83 వేల 453 మంది ఉన్నారు.
Mahbubnagar: మహబూబాబాద్ జిల్లా ల్లోని లోక్ సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజులు ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. మహబూబాబాద్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో జరిగే..
ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 80 శాతం పోలింగ్ లక్ష్యంగా పెట్టుకోవడంతో ప్రతి ఒక్క ఓటరుకు అవకాశం కల్పించాలని ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే పోలింగ్ బూత్లకు పోలింగ్ మెటీరియల్ తరలింపు పూర్తయింది. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ 'సిద్ధం' సభ నిర్వహించనుంది. అందుకు సంబంధించి భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. శనివారం మేదరమెట్ల ‘సిద్ధం’ ఏర్పాట్లను మంత్రి విడదల రజని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మూడు 'సిద్ధం' సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి…
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభంకానున్నాయి. ప్రతీ ఏటా నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల నుంచి భవానీలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
ఈ నెల 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల ఏర్పాట్ల పై అధికారులు సమీక్షించారు. ఈ సమీక్షలో ఎండోమెంట్ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని, వీఎంసీ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్, ఈఓ భ్రమరాంబ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అని మేడ్చల్ డీసీపీ సందీవ్ రావు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాము.. ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేపడుతుంది అని డీసీపీ పేర్కొన్నారు. అన్ని శాఖల సిబ్బంది ఇక్కడే ఉన్నారు.. నిన్న సాయంత్రం నుండే చాలా మంది ఎల్బీ స్టేడియం దగ్గరకు వెళ్తున్నారు అని ఆయన తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భూమిపూజకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రానున్నారు. నాగులపల్లిలో రైల్వే కోచ్ తయారీ కేంద్రం, కొల్లూరులో డబుల్ బెడ్ రూం పనులకు సీఎం శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, స్ధానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు.