Peddapalli: పెద్దపెల్లి పార్లమెంట్ స్థానంలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 15 లక్షల 96 వేల 430 కాగా.. పోలైన ఓట్లు 10 లక్షల 83 వేల 453 మంది ఉన్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కు సంబంధించి రెండు జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. పెద్దపెల్లి జిల్లా సెంటినరీ కాలనీ
జేఎన్టీయూలో పెద్దపెల్లి, రామగుండం, మంథని, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కింపు ప్రక్రియ కోసం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్ కల్ల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
Read also: Karimnagar: కరీంనగర్ లో కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం..
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు షురూ కానున్నాయి. రౌండ్స్ వారీగా లెక్కింపు మొదలు కానున్నాయి. పెద్దపెల్లి 21 రౌండ్స్, మంథని 21, రామగుండం 19, ధర్మపురి 19, మంచిర్యాల 21, బెల్లంపల్లి 16, చెన్నూరు 16 రౌండ్స్ వారీగా లెక్కింపు కొనసాగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Medak: మెదక్ లోక్ సభ ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్ధం..