సీఎస్కే మ్యాచ్ కు ముందు అర్జున్ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో ముంబై ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అర్జున్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఖాయమని ముంబై అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
Team India: ముంబై రంజీ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నా అతడికి టీమిండియాలో చోటుదక్కలేదని పలువురు బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. కానీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం సెలక్టర్లపై విమర్శలకు దిగుతుండటం పలువురికి నచ్చడం లేదు. అయితే తాజాగా సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషధ్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తెలిసీ తెలియని వయసులో సర్ఫరాజ్ తనతో చెప్పిన మాటల్ని నౌషధ్…
సెలెబ్రిటీ స్టేటస్ ఉన్నవారు ఎవరితోనైనా కాస్త సన్నిహితంగా మెలిగినా, కనీసం కలిసి ఫోటో దిగినా.. ఆ ఇద్దరి మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే రూమర్లు పుట్టుకొచ్చేస్తాయి. ఇప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌పై అలాంటి రూమర్లే తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో అతను సన్నిహితంగా ఉన్న ఫొటో ఒకటి నెట్టింట్లో దర్శనమిచ్చింది. అందులో అర్జున్, వ్యాట్ కాస్త చనువుగా ఉండటాన్ని గమనించవచ్చు. అంతే, అది చూసిన నెటిజన్లు…
భారత్ లో క్రికెట్ ఒక మతం అయితే అతడు దేవుడు. అతని పేరు వింటే చాలు దిగ్గజ బౌలర్లకు కూడా నిద్ర పట్టని సందర్భాలు చాలానే ఉన్నాయి. అతడుబ్యాటింగ్ కి వచ్చాడంటే సెంచరీ ఖాయం అని అనుకొనే ఫామ్ అతడిది. అతడు సరిగ్గా బ్యాటింగ్ చేస్తే భారత్ విజయం సాధించినట్టే అని అనుకొనే ఆట అతని సొంతం. అతను అవుట్ అయితే చాలు TV లు ఆఫ్ చేసి, మ్యాచ్ ఓడినట్టే అని అనుకునేవాళ్లం . అతను…
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఇటీవల ఐపీఎల్‌లో అరంగేట్రం విషయంలో ముంబై ఇండియన్స్ జట్టు మొండిచేయి చూపగా.. తాజాగా రంజీ నాకౌట్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులోనూ అర్జున్ టెండూల్కర్‌కు చోటు దక్కలేదు. దీంతో అతడి క్రికెట్ కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇంతవరకు అరంగేట్రం చేయని అర్జున్ టెండూల్కర్‌ను రంజీలలో ఆడిస్తారని అందరూ ఆశించారు. దీంతో జూన్ నుంచి మొదలు…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ గాయంతో ఐపీఎల్ 2021లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ కనీస ధర 20 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే అర్జున్ ముంబై తరపున ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. అలా ఐపీఎల్ ఆడకుండానే గాయం కారణంగా అర్జున్ తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం యూఏఈ నుండి అర్జున్ ఇండియాకి వస్తున్నాడు. ఇక అర్జున్ టెండూల్కర్ స్థానంలో రైట్…