IPL 2023 : ఆదివారం కోల్ కతా నైట్ రైడర్స్ ని 5 వికెట్ల తేడాతో ఓడించడంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో రెంవడ విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లో 6 వికెట్లకు 185 పరుగుుల చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబై టీమ్ 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఈజీగా టార్గె్ట్ ను ఛేదించింది. ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ 58 పరుగులతో అర్థ సెంచరీతో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అదే సమయంలో ఈ మ్యాచ్ తర్వాత ఇషాన్ కిషన్ తోటి ఆటగాళ్లతో కలిసి అద్భుతమై డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో అర్జున్ టెండూల్కర్ కూడా ఉన్నాడు.
Media error: Format(s) not supported or source(s) not found
Download File: https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2023/04/Snapinsta.app_video_10000000_5984499721616234_4260233577051032526_n.mp4?_=1Read Also : Padi Kaushik Reddy : ఉద్యమ కారుడు బాలరాజును చంపించిన వ్యక్తి ఈటల.. కౌశిక్‌రెడ్డి సంచలనం
ముంబై ఇండియన్స్ తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఇషాన్ కిషన్ అద్భుతమైన డ్యాన్స్ చేస్తున్నాడు.. ఈ వీడియోలో అర్జున్ టెండూల్కర్, డెవాల్డ్ బ్రూయిస్, టీమ్ డేవిడ్ కూడా ఇషాన్ తో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఆటగాళ్లందరూ మరాఠీ పాట డోల్ డోల్టాయ్ 2.0 కి డ్యాన్స్ వేశారు. కేకేఆర్ తో జరిగిన తొలి ఇన్సింగ్స్ లో రోహిత్ శర్మ లేకపోవడంతో.. ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేపట్టాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ ( 104) సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో కేకేఆర్ 185 పరుగులు చేసింది. ఇక లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ టీమ్ 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించారు. ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 58 పరుగులుతో తుఫాన్ ఇన్సింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతను 5 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రోహిత్ శర్మ 20 పరుగులు చేశాడు.
Read Also : Shocking Murder : యూపీలో పట్టపగలే దారుణం.. యువతిని తుపాకీతో కాల్చి చంపిన దండగులు