Arjun Tendulkar Slams Century On Ranji Trophy Debut: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్.. తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నాడు. తన తొలి రంజీ మ్యాచ్‌లోనే అతను సెంచరీ నమోదు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా.. గోవా రంజీ టీమ్ తరఫున బరిలోకి దిగిన అర్జున్, రాజస్థాన్‌తో జరిగిన గ్రూప్-సీ మ్యాచ్‌లో రప్ఫాడించేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అర్జున్.. 207 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌ల సహాయంతో 120 పరుగులు సాధించాడు. యాదృచ్ఛికం ఏమిటంటే.. సచిన్ టెండూల్కర్ కూడా తొలి రంజీ మ్యాచ్‌లో శతకం కొట్టాడు. ఇప్పుడు అర్జున్ కూడా తండ్రి బాటలోనే నడిచి, మొదటి మ్యాచ్‌తోనే శతక వీరుల జాబితాలోకి చేరిపోయాడు. అయితే.. ఈ ఘనతను సచిన్ కేవలం 15 ఏళ్ల వయసులోనే సాధిస్తే, అర్జున్ 23 ఏళ్ల వయసులో సాధించాడు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. గోవా జట్టుకు అర్జున్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. అయితే.. బ్యాటింగ్‌లోనూ తన సత్తా చాటి, ఔరా అనిపించాడు. అర్జున్ ఇదే దూకుడు కొనసాగిస్తే.. భారత జట్టులో త్వరలో చోటు సంపాదిస్తాడని చెప్పుకోవడంలో సందేహం లేదు.
Shreya Iyer: శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత.. సూర్యకుమార్ రికార్డ్ బద్దలు
ఇక ఈ రంజీ మ్యాచ్ విషయానికొస్తే.. రంజీ ట్రోఫీ ఎలైట్ విభాగం గ్రూప్-సిలో భాగంగా గోవా, రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకోగా.. గోవా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆటలో భాగంగా 4 పరుగులు చేసిన అర్జున్.. రెండో రోజు ఆటలో విజృంభించాడు. ప్రత్యర్థి బౌలర్లను ధీటుగా ఎదుర్కొని, పరుగుల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో ప్రభుదేశాయ్ (212) అనే మరో క్రికెటర్ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా.. గోవా జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 493 పరుగులు చేసింది. ప్రభుదేశాయ్ డబుల్ సెంచరీ చేసినా.. తొలి రంజీ మ్యాచ్‌లోనే, అది కూడా ఏడో స్థానంలో దిగి సెంచరీ చేయడంతో అర్జున్ టెండూల్కర్ హైలైట్‌గా నిలిచాడు.
Crime News: హర్యానాలో శ్రద్ధా వాకర్ లాంటి ఘటన.. ట్రాలీబ్యాగ్‌లో కుళ్లిపోయిన మృతదేహం