Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ హాట్ టాపిక్ గా మారింది. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను గత ఫిబ్రవరిలో చంపేశారు. ఈ కేసులో అతీక్ అహ్మద్ కొడుక అసద్ అహ్మద్, అతని అనుచరుడు గులాం కీలక నిందితులుగా ఉన్నారు.