Arikomban: గత నెలలో కేరళలో విధ్వంస సృష్టించి వార్తల్లో నిలిచిన పోకిరి ఏనుగు ‘‘ అరికొంబన్’’ మళ్లీ దాడులను ప్రారంభించింది. కేరళ నుంచి తమిళనాడులోకి ప్రవేశించి అక్కడ దాడులకు పాల్పడుతోంది. తమిళానాడు తేనిలోకి ప్రవేశించి అక్కడ ప్రజలపై దాడులు చేసింది. ఇటీవల కేరళలోని ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్ నుంచి పట్టుబడిని అరికొంబన్ ను పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంలో వదిలిపెట్టారు అటవీ అధికారులు.
Rogue elephant Arikomban captured: కేరళలోని ఇడుక్కి జిల్లా ప్రజలను నానాకష్టాలు పెడుతున్న ఏనుగు ‘అరికొంబన్’ ఎట్టకేలకు చిక్కింది. అధికారులు ఎనుగును పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ విజయవంతం అయింది. ఏనుగును పెరియార్ టైగర్ రిజర్వ్ కు తరలించారు. నిన్న తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభం అయిన మిషన్ ఏనుగును గుర్తించలేకపోయింది. అయితే ఆదివారం మళ్లీ ఆపరేషన్ ప్రారంభించిన అధికారులు ఏనుగును గుర్తించారు.