అల్లూరి ఏజెన్సీలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో జిమాడుగుల, అరకు, మినుములూరు వద్ద మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు, ముంచింగి పుట్టు, పెదబయలు ప్రాంతాల్లో 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దాంతో అల్లూరి ఏజెన్సీలోని ప్రజలు చలికి వణుకుతున్నారు. పిల్లలు, వృద్దులు బయటికి రావాలంటే బయపడిపోతున్నారు. అల్లూరి ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజామున భారీగా మంచు కురుస్తోంది. చలి తీవ్రతకు ఆపి ఉంచిన వాహనాల…