ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నా విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో తన మతం కారణంగా కొన్ని అవకాశాలు రాలేదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, రెహమాన్ వెంటనే స్పందిస్తూ ఒక వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు. తన ఉద్దేశం ఎవరినీ బాధపెట్టడం కాదని, భారతదేశమే తన గురువు, తన…