Delhi : దేశ రాజధాని ఢిల్లీ గాలి రోజురోజుకు విషపూరితంగా మారుతోంది. ఆదివారం ఉదయం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) తీవ్ర స్థాయికి చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ఎక్కువైంది. ఢిల్లీలో ఎన్సీఆర్ పరిధిలో వాయు నాణ్యత నానాటికి క్షీణిస్తుంది. గత 4 రోజులుగా గాలి నాణ్యత సూచిక(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్-AQI) 300 పైనే ఉండడం గమనార్హం.