కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంరాష్ట్రంలోనే వైసీపీ నుంచి 2019 ఎన్నికల సమయంలో జగన్ ప్రకటించిన మొదటి అభ్యర్థిని ఇక్కడే ప్రకటించారు.. ..సీనియర్ నేత కెఈ కృష్ణమూర్తి వారసుడిగా రంగంలోకి దిగిన కెఈ శ్యామ్ ని ఓడించారు శ్రీదేవి..ఇపుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీదేవి ప్రతిష్ట మసకబారుతోందట. పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోతున్నారట.అనుచరుల దౌర్జన్యాలు, కుటుంబ సభ్యుల వివాదాలు, పార్టీలో గ్రూపులు వెరసి ఎమ్మెల్యే శ్రీదేవిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట.పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ, వెల్దుర్తి, కృష్ణగిరి, మద్దికెర, తుగ్గలి…
మంత్రివర్గ విస్తరణలో స్ధానం కోల్పోయిన అనంతరం తొలిసారి ప్రకాశం జిల్లాకు వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆయన అభిమానులు అనూహ్య రీతిలో ఘన స్వాగతం పలికారు. గుంటూరు, బాపట్ల జిల్లాల సరిహద్దు బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు చేరుకున్న ఉమ్మడి జిల్లా వైసీపీ శ్రేణులు వందల కార్లతో ర్యాలీగా వెళ్లి ఆయనను జిల్లాకు తీసుకు వచ్చారు. గుంటూరు, బాపట్ల జిల్లాల సరిహద్దుల వద్ద పర్చూరు, చీరాల నియోజకవర్గాల వైసీపీ నేతలు.. బొల్లాపల్లి టోల్ ప్లాజా…
కళ్యాణదుర్గం…ఈ నియోజకవర్గంలో ఏపీలో కొంత స్పెషల్ అని చెప్పాలి.అదేంటో కానీ, ఇక్కడ పోటీ చేసిన వారిని అడక్కుండానే మంత్రి పదవి వరిస్తూ ఉంటుంది.అందుకే ఈ నియోజకవర్గం లక్కీ అనుకునేలా మారిపోయింది. ఇందుకు పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్.. తాజాగా మంత్రి అయిన ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్.ఆమె తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో నియోజకవర్గంలో ఎప్పుడూ ఆమె పని చేసింది లేదు.కేవలం 2019ఎన్నికల ముందు నియోజకవర్గానికి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచారు.మరి అలాంటి ఉషాశ్రీ చరణ్ కు ఇప్పుడు జిల్లాలో…
రాజకీయాల్లో గుమ్మడికాయంత అవకాశాలే కాదు.. ఆవ గింజంత అదృష్టం ఉండాలి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు ఈ విషయం తెలియంది కాదు. ప్రభుత్వ అధికారిగా.. ప్రజాప్రతినిధిగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆయన.. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పాయకరావుపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన తీవ్ర వేదనలో కూరుకుపోయారు. తన సహజమైన వ్యక్తిత్వందాటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత అధినాయకత్వంపై ధిక్కారస్వరం వినిపించారు గొల్ల బాబూరావు. తనను తాను…
నూతనంగా కొలువుతీరింది జగన్ 2.O కేబినెట్. మంత్రులకు జగన్ శాఖలు కేటాయించారు. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం కేబినెట్‌లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్ బాషా, నారాయణ…
ఏపీలో లిక్కర్ రాజకీయం నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే రూ.50కే మందు అందిస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్లు కాక పుట్టిస్తున్నాయి.ప్రజాగ్రహ సభ కాస్త బీజేపీపై ఆ్రగహానికి కారణం అయింది. ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు మీడియానే కాదు జాతీయ మీడియా సైతం ఆయన ప్రసంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. సోము చేసిన వ్యాఖ్యలతో సభ ఉద్దేశం దారి మళ్ళిందంటున్నారు. తమ ప్రభుత్వం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఇవాళ చివరి రోజు భారీగా నమోదయ్యాయి నామినేషన్లు. 15న మునిసిపాలిటీ, 16న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. చంద్రబాబు స్వంత నియోజకవర్గం అయిన కుప్పం, నెల్లూరు కార్పోరేషన్ పైనే అందరి ఫోకస్ పడింది. కుప్పంలో పాగా వేయాలని వైసీపీ స్కెచ్ వేసింది. అక్కడ ఎలాగైనా పరువు నిలుపుకోవాలని టీడీపీ నేతలు పట్టుమీద వున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…