కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంరాష్ట్రంలోనే వైసీపీ నుంచి 2019 ఎన్నికల సమయంలో జగన్ ప్రకటించిన మొదటి అభ్యర్థిని ఇక్కడే ప్రకటించారు.. ..సీనియర్ నేత కెఈ కృష్ణమూర్తి వారసుడిగా రంగంలోకి దిగిన కెఈ శ్యామ్ ని ఓడించారు శ్రీదేవి..ఇపుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీదేవి ప్రతిష్ట మసకబారుతోందట.
పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోతున్నారట.అనుచరుల దౌర్జన్యాలు, కుటుంబ సభ్యుల వివాదాలు, పార్టీలో గ్రూపులు వెరసి ఎమ్మెల్యే శ్రీదేవిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట.పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ, వెల్దుర్తి, కృష్ణగిరి, మద్దికెర, తుగ్గలి మండలాలు ఉన్నాయి.ఎమ్మెల్యే బంధువర్గమే అన్ని మండలాలపై ఆధిపత్యం చేస్తూ, అన్ని వ్యవహారాలు చూస్తున్నారట.
అమకతాడు టోల్ ప్లాజా లో సిబ్బందిపై కర్రలతో దాడి చేశారు ఎమ్మెల్యే అనుచరులు.ఎమ్మెల్యే వాహనాన్ని పంపినా కాన్వాయ్ లో ఇతర వాహనాలను పంపడంలో ఆలస్యం అయిందని టోల్ గేట్ సిబ్బందిని కర్రలతో కొట్టారు.
ఈ తంగమంతా సిసి కెమెరాల్లో రికార్డయింది.వాహనంలో కర్రలు కూడా ఉంచుకొని తిరుగుతున్నారట ఎమ్మెల్యే అనుచరులు.టోల్ గేట్ సిబ్బంది ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదట.
గతంలో రైల్వే పనుల్లో కాంట్రాక్టర్ కమిషన్ ఇవ్వలేదనిసూపర్ వైజర్ ను కొట్టి బొలెరో వాహనం ధ్వంసం చేసి కంకర మిషన్ ఎత్తుకెళ్లారు ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు.కమిషన్ విషయం మాట్లాడడానికి పిలిచినా రాకపోవడంతో మద్దికెర లో సైట్ కి వెళ్లి మరీ దాడి చేశారట..మా పర్మిషన్ లేకుండా పనులు ఎలా చేస్తారని బెదిరించి దాడి చేశారు.
ఇక వెల్దుర్తి మండలంలో ఇనుప ఖనిజం త్వవకాల్లోను ఎమ్మెల్యే శ్రీదేవి కుటుంబ సభ్యులు వివాదాస్పదమయ్యారు.
లీజుదారునితో కుమ్మక్కై అక్రమంగా తవ్వుకున్న వ్యవహారం బయటపడింది.పార్వతి కొండ అక్రమంగా తవ్వి గ్రావెల్ అమ్ముకొనిస్థలం కబ్జా చేసారనే ఆరోపణలు ఎమ్మెల్యే అనుచరులపై ఉన్నాయట.పత్తికొండను అనుకొని ఉన్న కోట్లు విలువ చేసే విలువైన ప్రభుత్వ స్థలంపైపట్టాలు పుట్టించి అమ్ముకున్న వ్యవహారం వెనుక ఎమ్మెల్యే సన్నిహితుల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయట.
పత్తికొండ నియోజకవర్గంలో ఇసుక అక్రమాలు వివాదాస్పదమవుతున్నాయి.తుగ్గలి మండలం బొందిమడుగులలో ఎమ్మెల్యే అనుచరులు…ఇసుక తవ్వి కర్ణాటకకి తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.లారీ రూ.50 వేలు చొప్పన విక్రయిస్తున్నారట.దీంతో గ్రామస్థులు లారీని అడ్డుకొని ఆందోళన చేశారట.పోలీసులకు , రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో స్థానికులే రోడ్డుడెక్కారట.అనుచరుల దౌర్జన్యాలు, కుటుంబ సభ్యుల వివాదాలు
ఎమ్మెల్యే శ్రీదేవి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయనే చర్చ పార్టీ వర్గీయులు, సన్నిహితుల్లోనూ ఉందట.
Watch Here : https://youtu.be/ADnQuVSji_I