హిందూపురం గ్యాంగ్ రేప్‌పై మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్ స్పందించారు. ఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్ అత్యంత దుర్మార్గం, విజయదశమి రోజు స్త్రీని పరాశక్తిగా కొలిచే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడలిపై అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. అత్యారానికి పాల్పడిన దుండగులను సత్వరమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. వాచ్ మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.
చెన్నైలో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్ళూరు జిల్లా కవారిపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిలబడి ఉన్న గూడ్స్‌రైలును ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలుపురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎక్స్‌ప్రెస్ రైలులోని రెండు కోచ్‌లు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం తెలుస్తోంది.
రతన్ టాటా కన్నుమూత: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. సోమవారం టాటా ఆస్పత్రికి వెళ్లడంతో.. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఐసీయూలో చేరారని వార్తలొచ్చాయి. వాటిపై స్పందించిన రతన్ టాటా.. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన…
ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కీలక ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించనుంది. నేడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడోవరోజు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. నేడు శ్రీశైలంలో 8వ రోజు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం మహాగౌరి…
రేపు స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మచిలీపట్నం వస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నేషనల్ లా కాలేజీ, డంపింగ్ యార్డ్, టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.
తిరుపతి సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో హైడ్రామా నెలకొంది. కార్యాలయంలో అటెండర్ నానా హంగామా సృష్టించాడు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయాలంటూ మహిళా సబ్ రిజిస్టర్‌పై అటెండర్ దౌర్జన్యానికి దిగాడు. రెండు రోజుల క్రితం పెట్రోల్ పోసుకుని చనిపోతానంటూ డ్రామా నడిపాడు.