Perni Nani: కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ తనిఖీలపై పేర్ని నాని సెటైర్లు!
- పవన్ తనిఖీలపై పేర్ని నాని సెటైర్లు
- పవన్ తనిఖీలు ఓ మంచి ప్రయత్నం
- షిప్ మీదకు వెళ్లొద్దని చంద్రబాబు చెప్పారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ వెళ్లిన బోటులో కస్టమ్స్, పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారని.. అనుమతి ఇవ్వాల్సిన అధికారులు అక్కడే ఉండగా పర్మిషన్ ఇవ్వటం లేదని చెప్పటం ఏంటన్నారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం షిప్‌లో తనిఖీలు ఓ మంచి ప్రయత్నం అని, ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలన్నారు. పవన్‌ను షిప్ ఎక్కడవద్దని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పి ఉండాలని, లేకపోతే పవన్ అబద్ధం చెప్పి ఉండాలని పేర్ని నాని సెటైర్లు వేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. కాకినాడ పోర్టులో పెద్ద ఎత్తున పేదల బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్న విషయంపై స్పందించారు.
‘కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షిప్‌లో తనిఖీలు ఓ మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. ప్రాణాలకు తెగించి పవన్ చేసిన ఈ ప్రయత్నంపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. తనను షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వటం లేదని పవన్ చెబుతున్నారు. పవన్ వెళ్లిన బోటులో కస్టమ్స్, పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారు. షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వాల్సిన ఇద్దరు ఆయనతో ఉంటే.. అనుమతి ఇవ్వలేదని చెప్పటం ఏంటి?. ముందు రోజు కలెక్టర్ వెళ్ళటానికి అనుమతి ఇచ్చింది వారే కదా. పవన్‌ను షిప్ ఎక్కడవద్దని సీఎం చంద్రబాబు చెప్పి ఉండాలి. లేకపోతే పవన్ అబద్ధం చెప్పి ఉండాలి’ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
‘స్టెల్లా షిప్ సీజ్ చేయమని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అక్కడే కెన్ స్టార్ అనే మరో షిప్ కూడా ఉంది. కెన్ స్టార్ షిప్ సీజ్ చేయాలని పవన్ ఎందుకు అనలేదు. స్టెల్లాలో ద్వారంపూడి లేదా అతని తమ్ముడి బియ్యం కూడా లేవు. అయినా ఆ షిప్‌లో బియ్యంపై విచారణ చేయాలని కోరుతున్నాం. బియ్యం రవాణా విషయంలో చంద్రబాబు, పవన్ డ్రామా ఆడుతున్నారా?. కెన్ స్టార్ షిప్ యజమాని శ్రీను అనే వ్యక్తిది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు శ్రీను కాబట్టి దాని జోలికి వెళ్ళటం లేదు. శ్రీను ఒక్కడే 42 వేల టన్నుల పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నారు. అందుకే పవన్ కళ్ళకు గంతలు కట్టుకుని కెన్ స్టార్ జోలికి వెళ్ళటం లేదు. కెన్ స్టార్ షిప్ మీదకు కూడా పవన్, కలెక్టర్ వెళ్ళాలి. కెన్ స్టార్ షిప్ మీదకు వెళ్లొద్దని పవన్ కి చంద్రబాబు చెప్పారా?. ఎందుకు వెళ్ళలేదో పవన్ సమాధానం చెప్పాలి. బియ్యానికి వైఎస్ జగన్‌కి, అరబిందో సంస్థకు ఏం సంబంధం?’ అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
- Tags
- ap
- pawan kalyan
- Perni Nani
- tdp
- ycp
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!