Dead Body in Parcel: పార్శిల్‌లో డెడ్‌బాడీ కేసు.. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు!
- హోమ్ డెలివరీ డెడ్ బాడీ కేసు
- మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
- నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో కలకలం సృష్టించిన పార్సిల్‌లో డెడ్‌బాడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సాగి తులసి వచ్చిన పార్సిల్‌లోని మృతదేహం కాళ్ల మండలంలోని గాంధీనగరంకు చెందిన బర్రె పర్లయ్యదిగా గుర్తించారు. పని కోసం పిలిపించి పర్లయ్యను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సాగి తులసి చెల్లెలి భర్త సుధీర్ వర్మనే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుధీర్ వర్మ నాలుగు రోజులుగా పరారీలో ఉన్నాడు. ఎప్పటికప్పుడు సిమ్ కార్డ్స్, మొబైల్స్ మార్చుతూ.. తప్పించుకు తిరుగుతున్న సుధీర్ వర్మ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మరోవైపు మృతుడి స్వగ్రామానికి వెళ్లి పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ నెల 19న యండగండిలో సాగి తులసి అనే మహిళకు అందిన పార్సెల్లో మృతదేహం కనిపించింది. ఎలక్ట్రికల్ వస్తువులు వచ్చాయనుకొని చెక్క పెట్టెను తెరిచి చూడగా.. అందులో మృతదేహం కనిపించడంతో షాక్ అయింది. తులసి కుటుంబసభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. తులసి ఫిర్యాదుతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తులసికి మెసేజ్ పంపిన వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలింపు చేపట్టారు. పార్సిల్ అందిన నాటి నుంచి కనిపించకుండా పోయిన సాగి తులసి చెల్లెలి భర్త సిద్ధార్థ వర్మను నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్ పంపిన కారులోని మహిళ కోసం సైతం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!