చిత్తూరులో డివిజన్ డెవలప్‌మెంట్ ఆఫీసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా కొత్త డివిజన్ డెవలప్‌మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా డీడీవో కార్యాలయాలను ప్రారంభించారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్కరణలో భాగంగా రాష్ట్రంలో 77 డీడీవో ఆఫీసులను ప్రారంభించాం అని, విస్తృతంగా ప్రజలకు సేవలందించడానికి డీడీవో ఆఫీసులు ఉపయోగపడుతాయన్నారు. సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడానికి ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయి పవన్ కళ్యాణ్ చెప్పారు.
చిత్తూరు కార్యకర్తల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ‘కూటమి ప్రభుత్వం కేంద్రానికి బలం అయ్యింది. కార్యకర్తలకు గుర్తింపు కష్టపడితే వస్తుంది. గుర్తింపు కోసం నేను పనిచేయను.. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా. నాకు పదవి అలంకరణ కాదు.. ఓ బాధ్యత. ప్రభుత్వ ఉద్యోగి ఇంటిలో పదోన్నతులపై ఎంతో ఆసక్తి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులనేది చాలా కీలకం. ఉద్యోగుల పాత్ర తెలుసు కాబట్టి పదివేల మంది ఉద్యోగులకు ఒకేసారి పదోన్నతులు కల్పించాం. గోంతు లేని వారికి మనం గోంతు అవ్వాలి, వారికోసం బలంగా నిలబడాలి. జీవితంలో రిస్క్ తీసుకుంటునే విజయం సాధించగలం. అది కూటమి ప్రభుత్వం చేసి చూపించింది. 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారికంలో ఉంటుంది. గత ఇరవై సంవత్సరాలలో కోట్లాది రూపాయల ఎర్రచందనం తరలించి సోమ్ము చేసుకున్నారు. 2008 నుండి రాజకీయాల్లో ఉన్నాను.. చంద్రబాబు లాంటి వారిని కుప్పం రాకుండా అడ్డుకున్నారు. ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోకుడదు.. ప్రజలు అన్నింటిని దైర్యంగా ఎదుర్కొవాలి. కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరుతాయి. జనసేన కార్యకర్తలకు పరిపాలన పరంగా అనుభవం లేకపోవచ్చు కాని సమాజం కోసం కసిగా చేస్తారు. పార్టీ పరంగా ప్రతి నియోజకవర్గంలో ఓ కమీటి ఎర్పాటు చేస్తాం’ అని అన్నారు.