ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నేడు బెంగళూరులో పర్యటిస్తోంది. కర్నాటక మంత్రులు, అధికారులతో ఈ పధకం అమలు జరుగుతున్న తీరును సబ్ కమిటీ తెలుసుకుంటోంది. బెంగళూరులో ప్రధాన డిపోలను కమిటీ పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణిలు కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. సాయంత్రం 5 గంటలకు సీఎం సిద్దరామయ్యను ఏపీ మంత్రుల బృందం కలవనుంది. ఏపీలో మహిళల ఉచిత…
బీసీలను గత ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తనను, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును అన్యాయంగా జైలులో పెట్టారని మండిపడ్డారు. గత ప్రభుత్వం తప్పిదం వలన అన్ని ఆగిపోయాయని విమర్శించారు. త్వరలో నాగబాబు మంత్రి వర్గంలోకి వస్తారని, ఇక మార్పులు ఉండకపోవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో రైస్ పుల్లింగ్ జరిగిందని, తప్పు చేయకపోతే పేర్ని నాని ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. కాకినాడలో ఎన్టీవీతో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ……
ప్రతి ఆరు నెలలకు ఓసారి జాబ్ మేళా నిర్వహిస్తాం అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. తాను వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగానని, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. జీతం తక్కువైనా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఎమ్మెల్యే పులివర్తి నాని జాబ్ మేళాను ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ డీఆర్డీఏ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతోంది. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ హామీ…
తాడిపత్రిలో జరిగిన నూతన సంవత్సర వేడుకలు రాజకీయ రచ్చగా మారాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు మాత్రమే అంటూ నిర్వహించిన వేడుకలప్తె బీజేపీకి చెందిన యామిని శర్మ, మాధవీ లతలు చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఈ ఇద్దరు మహిళా నాయకులప్తె జేసీ వర్గీయులు విరుచుకుపడ్డారు. నియోజకవర్గ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో టీడీపీ కౌన్సీలర్లు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో జేసీ ట్రావెల్స్‌కు సంబంధించి బస్సు దగ్థం…
గోదావరి జిల్లాలో రేవ్ పార్టీలు కలకలంగా మారాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రేవు పార్టీ జరిగినట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పట్టణంలోని ఓ లేఔట్లో రేవు పార్టీ జరిగినట్టుగా నెట్టింట వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొంతమంది మహిళలు అర్ధనగ్న దుస్తులతో డాన్సులు చేస్తుండగా.. వారి మధ్య చాలామంది మందు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలతో…
ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటు అంశంపై సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ఆన్లైన్ విధానంలో ఈ సమీక్షకు హాజరుకానున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 1.20 గంటలకు విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం చంద్రబాబు వెళ్ళనున్నారు. ఆశ్రమంలో వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. సీఎం…
విశాఖపట్నం తీరంలో జరిగిన నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం (జనవరి 4) జరగనున్న నౌకాదళ వేడుకల సందర్భంగా.. అధికారులు గురువారం పూర్తిస్థాయి సన్నాహక విన్యాసాలు నిర్వహించారు. విమానాల నుంచి ప్యారాచూట్ల ద్వారా నావికులు దిగుతున్న క్రమంలో.. గాలి అనుకూలించకపోవడంతో రెండు ప్యారాచూట్ల ఒకదానికొకటి చిక్కుకున్నాయి. దీంతో పట్టుకోల్పోయిన ఇద్దరు నావికులు సముద్రంలో పడిపోయారు. అప్పటికే విశాఖ సముద్రంలో ఉన్న జెమినీ బోట్ల సిబ్బంది.. ఇద్దరు నావికులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. నావికులు సురక్షితంగా బయటపడడంతో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల ఎజెండాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై కేబినెట్లో చర్చ జరిగింది. జనవరి 8న ప్రధాని మోడీ వైజాగ్ రానున్నారు. వైజాగ్ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.…
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంద్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. 14 అంశాలు ఎజెండాగా క్యాబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం అయింది. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అంశాలే ప్రధాన అజెండాగా భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,700 కోట్ల రూపాయలు విలువ గల రెండు ఇంజరీనింగ్ పనులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు కేబినెట్…
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో దారుణం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ కారు కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేటుగాళ్లు కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వదిలి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కానిస్టేబుళ్ల పైనుంచి కారు వెళ్లినా కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గంపేట సీఐపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిర్లంపూడి మండలం…